రాష్ట్రీయం

అనర్హతపై ఏపిలో టెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: పార్టీ మారిన 12 మంది తెలంగాణ తెదేపా ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇప్పుడు ఏపిలో పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగిస్తోంది. 67 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో 20 మంది ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన వారి విషయంలో 3నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ మధుసూదనాచారిని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలలో మొదలయింది. హైకోర్టు ఆదేశం మేరకు 90 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తన వద్ద ఉన్న అనర్హత పిటిషన్లు విచారించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
ఈ వ్యవహారం ఏపిలో పార్టీ మారిన 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిస్తోంది. హైకోర్టు తీర్పు ప్రభావం ఏపిలో కూడా ఒకేలా కనిపిస్తుంది కదా? అన్న ఆందోళన మొదలయింది. ఇప్పటికే స్పీకర్ వద్ద ఫిరాయింపులకు సంబంధించిన ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నందున, తెలంగాణలో తెదేపా మాదిరిగానే, ఏపిలోనూ వైసీపీ కూడా కోర్టుకెక్కితే తమ పరిస్థితి ఏమిటన్న బెంగ వారిలో కనిపిస్తోంది.
ఈ విషయంలో ఏపి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ మొదలయింది. హైకోర్టు తీర్పు దృష్ట్యా అక్కడి నుంచి ఆదేశాలు వచ్చే వరకూ వేచి ఉండకుండా, ముందుగానే నిర్ణయం తీసుకుంటారా? లేక వైసీపీ నేతలు హైకోర్టు వరకూ వెళ్లే వరకూ వేచి చూసి, కొంత సమయం గడుపుతారా? అన్న చర్చ జరుగుతోంది. విదేశాల నుంచి వచ్చిన తర్వాత దానిపై కసరత్తు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా, ఏపి స్పీకర్ కూడా నైతిక విలువలు పాటించి, ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని వైసీపీ నేత అంబటి రాంబాబు ఇప్పటికే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా, తనకున్న విచక్షణాధికారాల మేరకు 12 మంది ఎమ్మెల్యేలు అనర్హులు కాదని తెలంగాణ స్పీకర్ నిర్ణయం ప్రకటించవచ్చు. స్పీకర్ చట్టానికి లోబడే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని, చట్టానికి లోబడి ఉండే ప్రతి అంశంపై న్యాయస్థానంలో సవాల్ చేసే వెసులుబాటు ఉందని తెలంగాణ టిడిపి పక్షాన వాదిస్తున్న న్యాయవాది స్పష్టం చేస్తున్నారు.
అంటే మూడునెలల్లోగా స్పీకర్ మధుసూదనాచారి ఏ నిర్ణయం తీసుకున్నా, దానిని బట్టి తెలంగాణ తెదేపా తిరిగి కోర్టును ఆశ్రయించడం ఖాయం. ఏపిలో కూడా కొంచెం అటు ఇటుగా ఇదే జరగవచ్చంటున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు కోర్టులకు లేదన్న ఒకే ఒక్క వాదనతో అనర్హత కేసును మరికొన్నాళ్లు లాగించవచ్చని, కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా అప్పటికి ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపడవలసిన పనిలేదంటున్నారు. ‘ఇది నైతిక వ్యవహారాలకు సంబంధించిన అంశమే తప్ప కోర్టుల్లో తేలేదికాదు. న్యాయవ్యస్థ శాసనవ్యవస్థతో ఘర్షణకు దిగే అవకాశాలు తక్కువ. ఒకవేళ హైకోర్టు తెలంగాణ టిడిపికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా మళ్లీ అది సుప్రీం గడప ఎక్కి తీరుతుంది. ఈలోగా ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవలసిన పనిలేద’ని ఓ ప్రముఖ న్యాయవాది వెల్లడించారు.

చిత్రాలు..ఏపి స్పీకర్ కోడెల శివ్రపసాదరావు, తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి