రాష్ట్రీయం

ఐటికి పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22:ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పాలనను మరింత సులభతరం చేసేందుకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే పిఎమ్ ఆవాస్ యోజన పథకం కింద సుమారు రెండు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడంతో పాటు, ఏవియేషన్ రంగం అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని అందించాలనీ నిర్ణయించింది. అలాగే సహకార చక్కర కర్మాగారాలలో చెరుకు ధర బకాయిలను చెల్లించేందుకు అమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం గురువారం ఐదు గంటల పాటు జరిగింది. మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి వెల్లడించారు. ఏపీ ఫెర్రో అల్లాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు విద్యుత్ బిల్లులలో రాయితీ, మినహాయింపు,వాయిదా పద్దతుల్లో చెల్లింపునకు మంత్రి మండలి షరతులతో అనుమతులను మంజూరు చేసింది. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో మెరైన్ అవుట్ ఫాల్ పైప్‌లైన్ నిర్మాణంలో నిర్వసితులైన వారికి 61 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీతో సుమారు 5 వేల మందికి పునరావాసం కల్పించాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఏపిలో ఆర్థిక నగరాల ఏర్పాటుకు ఏపీఐఐసీ మరియు ఏపీటీఎస్‌డీఐసీవో సంయుక్త భాగస్వామ్యంతో భూములను అభివృద్ధి నిర్ణయించింది. రాష్ట్రంలో ఏవియేషన్ అభివృద్ధిలో భాగంగా ఎయిర్‌పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం, ఆంధ్రప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి మంత్రిమండలి అనుమతులిస్తూ నిర్ణయించింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని నడపడానికి వీలుగా విశాఖ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని, వెనుకబడిన తరగతుల గ్యాడ్యూయేట్ విద్యార్ధుల పీజీ విద్య కోసం ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం ద్వారా విద్యార్ధులకు పదిలక్షల రూపాయల ఆర్ధిక సహాయానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నగర పంచాయితీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అవుట్ సోర్సింగ్, మున్సిపల్ కార్మికులకు వేతనాల పెంచేందుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. భారీ వర్షాలకు మరణించిన ఆరుగురికి ఒక్కోకరికి నాలుగు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక పరిహారం అందించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
భారీగా భూ కేటాయింపులు
రాష్ట్రంలో పలు సంస్థలకు భారీగా భూములను కేటాయిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు పశుసంవర్థక శాఖలో 300 పోస్టుల భర్తీ చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో బిసి భవనాలను నిర్మించాలనీ సంకల్పించింది. మంగళగిరిలో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. విశాఖ జిల్లా అడవివరంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఇంటర్నేషనల్ స్కూల్‌ను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా సదరు కన్సార్టియంకు దేవాదాయ భూములు కేటాయిస్తారు. అన్ని జిల్లాలలో టూరిజం కౌన్సిళ్లు, అమరావతి, విశాఖ, తిరుపతి, రాజమండ్రిలలో సిటీ టూరిజం కౌన్సిళ్ల ఏర్పాటు చేయాలని కూడా మంత్రి మండలి నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తర్లిపేట గ్రామంలోని 209.84 ఎకరాల భూమిని వేదిక్ విశ్వవిద్యాలయం స్థాపనకు శ్రీమత్ ఉభయ వేదాంతచార్య పీఠానికి 50 ఎకరాలను లక్షా 50 వేల రూపాయలకు, 159.84 ఎకరాల భూమిని ఎకరాకు 50 వేల రూపాయలకు షరతులతో మంత్రి మండలి కేటాయించింది.నెల్లూరు జిల్లా కోట మండలంలోని కొత్తపట్నం గ్రామంలో 52.22 ఎకరాల భూమిని 542.55 కోట్ల రూపాయల పెట్టుబడితో 250 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే 3వేల టీపీడీ సుగర్ రిఫైనరీ ప్లాంటు నిర్మాణానికి టయోటా నెక్కంటి మెగా ఫుడ్ పార్క్‌కు కేటాయించింది. విజయనగరం జిల్లా గురగుబిల్లి మండలం సుంకి-ఉల్లిబద్ర గ్రామంలోని ఉద్యానవనం కళాశాలకు ప్రథమ సంవత్సరం నిర్వహణ కోసం పలు ఉద్యోగాల భర్తీకి ఆమోద ముద్ర వేసింది.

చిత్రం.. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు