రాష్ట్రీయం

మెడికల్ సీట్లపై ఐటి కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ విజయవాడ, సెప్టెంబర్ 22: రెండు తెలుగు రాష్ట్రాల్లో మెడికల్, బిడిఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటా కింద చేరుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. బి కేటగిరి, సి కేటగిరి కింద మెడికల్ కోర్సుల్లో చేరిన విద్యార్ధుల జాబితాలను ఆయా కాలేజీల నుండి సేకరించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు తల్లిదండ్రులను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రాలో ఇప్పటికే కొంతమంది తల్లిదండ్రులకు నోటీసులు వెళ్లగా, తెలంగాణలో ఈనెల 25న నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. గత ఆర్ధిక సంవత్సరంలో తల్లిదండ్రులు సమర్పించిన ఆదాయ పన్ను రిటర్న్సులో పేర్కొన్న ఆదాయానికి, ప్రస్తుతం చెల్లించిన ఫీజులకు పొంతన ఉందా లేదా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఏపిలో ఐటి అధికారులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రుల చిరునామాలను సేకరించి, గురువారం నుంచి నోటీసులు జారీచేయటం ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఫీజు కేవలం రూ.6,700 ఉండగా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అధికారికంగానే రూ.11.50 లక్షల రూపాయలు చెల్లించటం జరిగింది. ఈ మొత్తానికి సంబంధించి అంత ఆదాయం ఏ విధంగా వచ్చింది, ఇతర ఆదాయ వివరాలను తక్షణం తెలపాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో బి కేటగిరి కింద 670 సీట్లు భర్తీ అయ్యాయి. నోటీసులు అందుకున్న తల్లిదండ్రులు ఆగమేఘాలపై ఆడిటర్లు, లాయర్ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే కాళోజీ నారాయణ రావు వైద్య విశ్వవిద్యాలయం కన్వీనర్ కోటా జాబితా విడుదలైంది. బి కేటగిరి, సి కేటగిరి సీట్ల వ్యవహారం కూడా రెండు రోజుల్లో తేలిపోతుంది. అంతకంటే ముందే ఐటి అధికారులు ఎమ్సెట్ డాటాను సేకరించినట్టు తెలిసింది. బి, సి కేటగిరి సీట్లను పొందిన అభ్యర్ధులకు నేరుగా నోటీసులు జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఫీజుల కోసం తల్లిదండ్రులు చూపించిన బ్యాంకు గ్యారంటీలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. తెలంగాణలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బి కేటగిరి సీట్లకు 14 లక్షలు, సి కేటగిరి సీట్లకు 42 లక్షలు వసూలు చేస్తున్నాయి. మైనార్టీ కాలేజీల్లో ఈ ఫీజు స్వల్పంగా తగ్గించారు.