రాష్ట్రీయం

గుంటూరు చెరువైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: అనూహ్యంగా కురిసిన వర్షాలకు గుంటూరు జిల్లాలో ఊరూ ఏరూ ఏకమైంది. రోడ్లకు రోడ్లే కొట్టుకుపోయాయి. కాలనీలు జలమయమయ్యాయి. రైలు, రోడ్డు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద నీటి ఉద్ధృతికి ఐదుగురు మరణించారు. ఒకరు గల్లంతయ్యారు. జిల్లాలో అత్యధికంగా నకరికల్లులో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఊటుకూరు వద్ద ఉప్పొంగిన వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులో ఉన్న 42మందినీ సకాలంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడింది. చిలకలూరిపేట-నరసరావుపేట- సత్తెనపల్లి-మాచర్ల రోడ్లు తెగిపోయి, వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. నెమలిపురి వాగునీరు రైలు పట్టాలపై చేరడంతో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి, ప్రయాణికులను ట్రాక్టర్లలో పిడుగురాళ్లకు తరలించారు. సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. గుంటూరు రీజియన్‌లోని 510 బస్సులు డిపోలు వీడి బయటకు రాలేదు. పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ పొంగిపొర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ 72 గేట్లూ ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణా, కర్నూలు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలనూ భారీ వర్షాలు కుదిపివేశాయి. వరద పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు. అత్యవసర సహాయంకోసం మచిలీపట్నంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

చిత్రం.. క్రోసూరు వద్ద వరద నీటిలో చిక్కుకుపోయిన బస్సు. సహాయంకోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు