రాష్ట్రీయం

పులి‘చింత’ల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, సెప్టెంబర్ 22: భారీవర్షాలకు పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. మునుపెన్నడూ లేనిరీతిలో పులిచింతలకు నీరు రావడంతో అటు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో 13 గ్రామాలు, ఎపిలో గుంటూరు జిల్లాలోని 11 గ్రామాలకు ముంపు ముప్పు ఏర్పడింది. ఎగువన క్యాచ్‌మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కురవడంతో పులిచింతలకు వరదనీరు పోటెత్తింది. ఇన్‌ఫ్లోగా 4.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 12 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో భారీయెత్తున నీరు నిల్వచేయడం వల్ల నల్గొండ జిల్లా గ్రామాలు నీట మునుగుతాయని, దిగువకు మరింత నీటిని వదలాలని తెలంగాణ అధికారులు కోరారు. దీంతో నీటి పారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టిఎస్ మంత్రి హరీశ్‌రావుకు ఫోన్‌చేసి సమన్వయంతో సమస్యను పరిష్కరించుకుందామని సూచించారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టులో 29 టిఎంసిల నీటిని అధికారులు నిల్వచేశారు. దిగువకు నీరు వదలడంతో చల్లగరిగ గ్రామానికి చెందిన జానునాయక్ (60) కృష్ణానది వద్ద పశువులను మేపడానికి వెళ్లి నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీ మొత్తం 72 గేట్లను పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

చిత్రం.. పులిచింతల గేట్లు ఎత్తివేయడంతో గురువారంనాడు కిందకు ఉరకలేస్తున్న వరద