రాష్ట్రీయం

హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. వర్షాల కారణంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ పరిధిలోని విద్యాసంస్థలకు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం నుంచి ఎప్పటికప్పుడు మంత్రి కెటిఆర్, రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిహెచ్‌ఎంసి కమిషనర్‌తో పరిస్థితిని సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. అవసరమైతే ఆర్మీ సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. రెండు రోజులపాటు భారీ వర్షాలు, మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను, పురాతన భవనాలను ఖాళీ చేయించి శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. పోలీసుశాఖలోని వివిధ విభాగాలతోపాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాలను సహాయక చర్యల్లో ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా వర్షాల పరిస్థితిపై మంత్రి కెటిఆర్ గురువారం పొద్దుపోయాక సమీక్షించారు. మరో మూడు రోజులు వర్ష సూచన ఉన్నందున ఐటి సంస్థలు కూడా సెలవు ప్రకటించాలని కోరారు. అలాగే ఎవరు పడితే వారు మ్యాన్‌హోల్స్ తెరవడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.