రాష్ట్రీయం

నగరం మునకేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ నగరం నిండా మునిగిపోయింది. భవనాలకు భవనాలే జల దిగ్బంధమయ్యాయి. బుధవారం కురిసిన భారీ వర్షం నుంచి కోలుకోక ముందే గురువారమూ ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురిసిన కుంభవృష్టితో నగరం అతలాకుతలమైంది. రహదారులు నదులనే తలపించాయి. కాలనీలు జలమయం కావడంతో జల దిగ్బంధంలో చిక్కుకున్న కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్ వాసులకు ప్రభుత్వం రొట్టెలు, మంచినీటిని పంపిణీ చేసింది. మరోవైపు హుస్సేన్‌సాగర్ ఉప్పొంగుతోంది. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 514 మీటర్లు కాగా, ఇప్పటికే 513 అడుగులకు చేరింది. వచ్చిన నీరు వచ్చినట్టుగా దిగువకు వదలుతున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను జిహెచ్‌ఎంసి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ట్రాఫిక్ సమస్య గురించి చెప్పక్కర్లేదు. వర్షాలకు తోడు రోడ్లపై ఏర్పడిన గుంతలు వాహనాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే ప్రమాదముందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇళ్లు కదలొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. బేగంపేట, నిజాంపేట ప్రాంతాల్లో నీట మునిగిన కాలనీల్లో మంత్రి కెటిఆర్ పర్యటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

చిత్రం.. మలక్‌పేటలో చెరువును తలపిస్తున్న మునిసిపల్ కాలనీ