రాష్ట్రీయం

ఏజన్సీలో ఎడతెరిపి లేని వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం టౌన్, సెప్టెంబర్ 22: ఏజన్సీ ఏరియాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగి పోర్లుతుండటంతో రవాణా సౌకర్యానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుండాల మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కినె్నరసాని రిజర్వాయర్‌కు వరదనీరు పెద్ద ఎత్తున రావటంతో గురువారం జెన్‌కో అధికారులు నాలుగు గేట్లు ఎత్తివేశారు.
తాలిపేరు ప్రాజెక్టులో ఏడు గేట్లు ఎత్తివేశారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం అధికమైంది. జిల్లాలో గుండాల మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుండాల మండలంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గుండాల-కొత్తగూడెం, ఆళ్లపల్లి-గుండాల, పినపాక-గుండాల, పసర-గుండాల రోడ్డు మార్గాలకు అంతరాయం ఏర్పడటంతో జనజీవనం స్తంభించిపోయింది. గుండాల మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు కినె్నరసాని రిజర్వాయర్‌లో నీటిమట్టం 408 అడుగులకు చేరటంతో కినె్నరసాని గేట్లను ఎత్తివేసి 19వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కినె్నరసాని రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడం ఈ ఏడాదిలో నాలుగవ సారి ఏజన్సీ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు నువ్వులు, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు అంచనావేస్తున్నారు.

చిత్రం.. కినె్నరసాని గేట్లు ఎత్తివేసిన దృశ్యం