రాష్ట్రీయం

అనుక్షణం.. అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: అసాధారణ వర్షాలతో సంభవించిన నష్టాలను అంచనా వేసి నివేదిక ఇవ్వాల్సిందిగా సిఎస్ రాజీవ్ శర్మను సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భారీ నష్టాలపై కేంద్ర సాయం కోరనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ పర్యటన నుంచే సిఎం వర్షాలు, వరదల పరిస్థితిని సమీక్షించారు. సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకున్న సిఎం కెసిఆర్, అసాధారణ వర్షాలపై మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. నేడు, రేపు భారీ వర్షాలను ప్రకటించిన నేపథ్యంలో మంత్రులంతా అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితివుంటే తప్ప ప్రజలు రోడ్లపైకి రావొద్దని సిఎం కెసిఆర్ సూచించారు. రాష్టవ్య్రాప్తంగా భారీ వర్షాలు, వరదల వల్ల అపార నష్టం సంభవించిందన్నారు. చెరువు కట్టలు తెగిపోవడం, బుంగలు పడటం, రోడ్లు దెబ్బతినడం, వంతెనలు కూలిపోవడం వంటి అనేక సంఘటనలు జరిగాయన్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులకు అపార నష్టం వాటిల్లిందని, వీటన్నింటినీ అంచనా వేసి నివేదిక సమర్పించాలని సిఎస్‌ను ఆదేశించారు. రాష్ట్రంలో చాలాచోట్ల పంట నష్టం జరిగిందని, వాటితోపాటు రహదారులు, ఇతర వౌలిక వసతులకు జరిగిన నష్టాలన్నీ నివేదికలో పొందుపర్చాలని సూచించారు. నివేదిక వచ్చిన తర్వాత జరిగిన నష్టానికి కేంద్ర సాయం కోరదామన్నారు. ఇలాఉండగా వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని తెలుసుకోవడానికి రాజీవ్ శర్మ సచివాలయం నుంచి కలెక్టర్లతో విడివిడిగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలవారీగా నివేదికలు త్వరతగతిన సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. ఇదిలావుంటే, భారీ వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య మంత్రి సి లక్ష్మారెడ్డి తన శాఖలో అలర్ట్ ప్రకటించారు. ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, సెలవులు తీసుకోవద్దన్నారు. తిరిగి సాధారణ పరిస్థితి నెలకొనే వరకూ అలెర్ట్ కొనసాగుతుందన్నారు.
మరో మూడు రోజులు భారీ వర్షాల ప్రమాదం ఉన్నందున సహాయ కార్యక్రమాలకు ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ను సిద్ధంగా ఉంచినట్టు మున్సిపల్ మంత్రి కె తారక రామారావు తెలిపారు. భారీ వర్షాలకు నీట మునిగిన పలు ప్రాంతాల్లో కెటిఆర్ పర్యటించారు. ట్యాంక్‌బండ్ ప్రమాదకరస్థితిలో ఉందన్న పుకార్లను నమ్మవద్దన్నారు. పునరావాస చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉచిత భోజన సౌకర్యం కల్పించామన్నారు. అసాధారణ వర్షాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలూ శ్రమిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.