రాష్ట్రీయం

వృద్ధిరేటు సరాసరి 12% సమ్మతం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సంవత్సరానికి కోటిన్నర టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్ధలు, పరిశ్రమలపై నియంత్రణాధికారాలను రాష్ట్రాలకే అప్పగించేందుకు కేంద్రం అంగీకరించినట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ రెండవ సమావేశానికి ఆర్థిక మంత్రి రాజేందర్ హాజరయ్యారు. అనంతరం కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేఖరులకు వివరించారు. పన్నులకు సంబంధించిన ‘బేస్ ఇయర్’గా 2015-16 సంవత్సరాన్ని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. అయితే తెలంగాణ రాష్ట్రం రెవిన్యూ వృద్ధిరేటు 17, 18 శాతం ఉన్నందున దేశవ్యాప్తంగా 12 శాతం వృద్ధిరేటును సరాసరి తీసుకోవాలన్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. కోటిన్నర పైబడి టర్నోవర్ చేసే వ్యాపార సంస్థలు, పరిశ్రమలనుంచి 91 శాతం ఆదాయం ఉంటుందని, దీన్ని రాష్ట్రాల నియంత్రణలో ఉంచాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అలాగే సర్వీసు టాక్స్ కట్టేవారిని ప్రస్తుతం కేంద్ర పరిధిలో ఉంచినా, రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు శిక్షణ ఇచ్చిన అనంతరం పరిధి మార్పు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. అదేవిధంగా రాష్ట్రాలకు పరిహారం చెల్లింపులు మూడు నెలల్లోపు పూర్తి చేయాలని, రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం చేసిందని వెల్లడించారు.