రాష్ట్రీయం

ఇంటికి చేరిన ప్రొఫెసర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ అల్వాల్/ నాచారం, సెప్టెంబర్ 24: లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగావున్న ఇటీవలే విడుదలైన తెలుగు ప్రొఫెర్లు గోపికృష్ణ, బలరాం కిషన్‌లు శనివారం హైదరాబాద్‌కు క్షేమంగా చేరుకున్నారు. మొదట లిబియా నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రొఫెసర్లు అక్కడి నుంచి నేటి తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే వీరి రాక సమాచారం వారి కుటుంబ సభ్యులకు తెలియదు. ఢిల్లీ నుంచి ప్రొఫెసర్లకు తోడుగా విదేశాంగ శాఖకు చెందిన నలుగురు అధికారులు కూడా వచ్చారు. గత సంవత్సరం జూలై 29న ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లతోపాటు కర్నాటకకు చెందిన మరో ఇద్దరిని ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. వీరంతా లిబియాలోని సిర్టే యూనివర్శిటీలో ప్రొఫెసర్లుగా పనిచేసే వారు. కన్నడిగులను ముందే వదిలిపెట్టిన ఉగ్రవాదులు గోపికృష్ణ, బరాం కిషన్‌లను మాత్రం ఏడాదికి పైగా తమ ఆధీనంలో ఉంచుకున్నారు.
నరకం అనుభవించాం: గోపికృష్ణ
లిబియా ఉగ్రవాదుల చేతుల్లో 14నెలల పాటు నరకం అనుభవించామని బాధితుడు గోపికృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యోగంకోసం వెళ్లిన తమను లిబియా ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. వారి రక్షణకోసం తమను బందీలుగా పెట్టుకున్నారని, విదేశంగా శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ తమ విడుదల కోసం ఎంతో శ్రమించారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
సంతోషంగా ఉంది: బలరాం
లిబియానుంచి తిరిగొచ్చి తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడం సంతోషంగా ఉందని ప్రొఫెసర్ బలరాం కిషన్ అన్నారు. శనివారం అల్వాల్ మున్సిపాలటీ పరిధిలోని కానాజిగూడ ప్రేమ్‌సాగర్ ఎన్‌క్లేవ్‌కు ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే ప్రొఫెసర్లు వారి ఇళ్లకు ఎప్పుడు వస్తారు.. ఎలా వస్తారు అన్న విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఇంటికి వచ్చిన ప్రొఫెసర్ బలరాం కిషన్ విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో తాను ఏమీ మాట్లాడలేనని, దీనికి సంబంధించి కొన్ని షరతులు ఉన్నాయని, మరోవైపు తాను అనారోగ్యంగా ఉన్నానని చెప్పారు. అపద సమయంలో తనకు, తన కుటుంబానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాము అక్కడి యూనివర్శిటీలో ఆంగ్లం బోధించేవారమని, దీంతో కిడ్నాపర్లు కూడా తీవ్రవాదులకు ఆంగ్లంలో శిక్షణ కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి ఆంగ్లంలో క్లాసులు చెప్పించారనీ దానికి ప్రతిగా వదిలి పెట్టారనీ చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ , మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డిలు ప్రొఫెసర్ల కుటుంబీకులను ప్రధాన మంత్రి వద్దకు తీసుకెళ్లి వీరి విడుదల కోసం భరోసా ఇప్పించారు. లిబియా ప్రభుత్వంతో నిరంతరం చేసిన దౌత్యం ఫలించి కిడ్నాపర్‌లు ప్రొఫసెర్లను ఈ నెల 14న లిబియాలో విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ట్విటర్‌లో ప్రకటించారు. దాని తర్వాత అన్ని పనులు రహస్యంగానే జరిగాయి. ఎట్టకేలను ఇద్దరు తెలుగు ప్రోఫెసర్లు వారి కుటుంబ సభ్యుల చెంతకు చేరడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

చిత్రం.. కుటుంబ సభ్యులతో బలరాం, గోపీకృష్ణ