రాష్ట్రీయం

కొనసాగుతున్న అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: అల్పపీడనానికితోడు అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి విధర్భ మీదుగా దక్షిణ చత్తీస్‌గడ్ మధ్య తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ దక్షిణ కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చాలాచోట్ల వర్షం కురుస్తుంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురియవచ్చు. ఇదే సమయంలో నైరుతి దిశగా తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలను అతిభారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గత 24 గంటల్లో కుంభవృష్టి కురిసింది. గతంలో లేని విధంగా ఆర్మూర్‌లో 39 సెంటీమీటర్లు, మద్నూర్, రెంజల్, బోధన్‌లలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ దృష్టి నిజామాబాద్ జిల్లాపై కేంద్రీకృతమైంది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండి శాస్తవ్రేత్త డాక్టర్ రంజీత్ సింగ్ పేరుతో శనివారం బుల్లెటిన్ విడుదలైంది.