రాష్ట్రీయం

నష్టం అపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 24: గుంటూరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాలైన క్రోసూరు, పెదనందిపాడు, పమిడివారిపాలెం, కాకుమాను, బాపట్ల, తదితర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద రహదారిపై హెలీకాప్టర్ దిగి, రోడ్డుమార్గాన బయల్దేరి అనుపాలెం వద్ద దెబ్బతిన్న రైల్వేట్రాక్‌ను పరిశీలించారు. రెడ్డిగూడెం, మాచాయపాలెం, కొండమోడు గ్రామాల నిర్వాసితులు ముఖ్యమంత్రి కాన్వాయి వద్దకు చేరుకుని సర్వస్వం కోల్పోయామంటూ తమ బాధలు ఏకరవుపెట్టారు. తక్షణ సాయంగా కిరోసిన్, బియ్యం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. సత్తెనపల్లి, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి మండల గ్రామాల్లో కోతకు గురైన రహదార్లు, వరద నీట నానుతున్న పంట పొలాలను చూసి త్వరలో నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. క్రోసూరు మండలం పీసపాడు, అందుకూరు, విప్పర్ల, ఊటుకూరు, బయ్యవరం గ్రామాలను కూడా ఆయన సందర్శించారు. ఊటుకూరు వద్ద వరదల కారణంగా వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకున్న విషయాన్ని అధికారులు గుర్తుచేశారు. వాగులపై ఫుట్ బ్రిడ్జిలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అమరావతి మండలం మునుగోడు గ్రామంలో కొండవీటి వాగు వరద వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు.
ఇదిలావుండగా జిల్లాలో వరద సహాయ పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఆరుగురు ఐఏఎస్ అధికారులను నియమించింది. అజయ్ కల్లాం, శ్యాంబాబు, అజయ్ జైన్, జవహర్‌రెడ్డి, రామాంజనేయులు, శశిభూషణ్ కుమార్ నియమితులయ్యారు. వరద సహాయ, పునరావాస కార్యక్రమాలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.
రెడ్డిగూడెం సందర్శన
రాజుపాలెం:గుంటూరు జిల్లా రెడ్డిగూడెంలో కొట్టుకుపోయిన బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. గణపవరం రోడ్డులో హెలికాప్టర్ నుండి దిగి కాన్వాయ్‌లో బ్రిడ్జి వద్దకు వెళ్తుండగా గ్రామస్థులు అడ్డుకోవడంతో సిఎం వాహనంలో నుండి బయటకు వచ్చి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించి నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేకు సూచించారు.