రాష్ట్రీయం

కుంభవృష్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఉత్తర తెలంగాణ జిల్లాలను అతిభారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గత 24 గంటల్లో కుంభవృష్టి కురిసింది. గతంలో లేని విధంగా ఆర్మూర్‌లో 39 సెంటీమీటర్లు, మద్నూర్, రెంజల్, బోధన్‌లలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ దృష్టి నిజామాబాద్ జిల్లాపై కేంద్రీకృతమైంది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఉత్తర తెలంగాణ, దక్షిణ చత్తీస్‌గఢ్, విదర్భ మద్య కేంద్రీకృతమైన అల్పపీడనం వల్ల తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండి శాస్తవ్రేత్త డాక్టర్ రంజీత్ సింగ్ పేరుతో శనివారం బుల్లెటిన్ విడుదలైంది. ఉత్తర కర్నాటక, మధ్యమహారాష్ట్ర, మరాట్వాడా, విదర్భలలో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఈ ప్రకటనలో వివరించారు. గత 24 గంటల్లో నిజామాబాద్ జిల్లాలోని నందిపేట, బాల్కొండ, జక్రాన్‌పల్లి, వేల్పూరు, నవీపేట, తాడ్వాయి, మాక్లూరు, ఎడపల్లి, మోర్తాడ్, లింగంపేట, వర్ని, కోటగిరిలలో 14 సెంటీమీటర్లపైగా వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లపైగా వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలోని ముదోల్, ఉట్నూరులలో 12 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా బయ్యారం, రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, హైదరాబాద్ తదితర జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి.

చిత్రం.. మెదక్‌లో మంజీరా వంతెన అంచున నిలిచిన లారీ