రాష్ట్రీయం

కరవుతీరా వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణలో పండుగ ముందే వచ్చింది. కరవుతీరా వానలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, బావులు, వంకలు, వాగులు నిండిపోయాయి. భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతోపాటు, తెలంగాణ పీఠభూమిపై కురుస్తున్న భారీ వర్షాలు కరవు తీర్చేసేలాగే కనిపిస్తోంది. 16ఏళ్ల తరువాత సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండటాన్ని చూస్తే, ఏపాటి వర్షాలు కురుస్తున్నాయో అంచనా వేసుకోవచ్చు.
సంస్కృతికి, నీటికి సంబంధించిన బతుకమ్మ పండుగకు స్వాగతం పలుకుతున్నట్టుగా జల వనరులన్నీ నీటితో నిండిపోయాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బతుకమ్మ పండుగకు ఈసారి నీటి కళ జత కలిసింది. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ వరదతో నిండిపోగా, గేట్లను తెరిచి జలాలను కిందికి వదిలేస్తున్నారు. ఇక కృష్ణా బేసిన్‌లో మాత్రం ఇంకా కొంతవరకు ప్రాజెక్టులు నిండాల్సి ఉంది. గోదావరి బేసిన్‌తోపాటు కృష్ణా బేసిన్‌లోను ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు గ్రామస్తులు వరద బారిన పడకుండా ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అదే సమయంలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలన్నీ వరద నీటితో నిండిపోవడంతో అటు ప్రభుత్వం ఇటు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కురిసిన వర్షాల వల్ల మరో రెండు మూడేళ్ల వరకు తెలంగాణను కరువనేది పలకరించే సాహసం చేయదని సాక్షాత్తూ సిఎం కెసిఆర్ ప్రకటించారు.
గోదావరి బేసిన్ ప్రాజెక్టులు కళకళ
నిజాంసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 1405 అడుగులు (17.8 టిఎంసి). కాగా ప్రస్తుతం 1400.5 అడుగుల (12 టిఎంసి)తో నిండుకుండలా ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో పెట్టుకుని లక్షా 20వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1.9లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద పరిస్థితిని బట్టి గేట్లను ఎత్తుతున్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి సామర్థ్యం 1091 అడుగులు (90.31 టిఎంసి). ప్రస్తుతం 1090 అడుగులకు (84 టిఎంసి) నీరు చేరింది. వచ్చిన నీటిని వచ్చినట్టే కిందకు వదిలేస్తున్నారు. ఎల్లంపల్లి సామర్థ్యం 485.56 అడుగులు (20.18 టిఎంసి). ప్రస్తుతం 479 అడుగుల వరకు నీరుంది. 4.32 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంటే, 4.53 లక్షల క్యూసెక్కులను కిందకు వదిలేస్తున్నారు. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 700 అడుగులు. పూర్తి సామర్థ్యానికి కేవలం రెండడుగులు తక్కువగా జలాలు (7.18 టిఎంసి) ఉన్నాయి. ఇన్‌ఫ్లో 5వేల 786 క్యూసెక్కులుంటే, ఔట్ ఫ్లో 545 క్యూసెక్‌లుగా ఉంది. ఎల్‌ఎండి ప్రాజెక్టు సామర్థ్యం 920 అగుగులు (24.07 టిఎంసి). ప్రస్తుతం 906.15 అడుగుల మేర నీరు చేరింది. సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం 1717 అడుగులు (29.91 టిఎంసి). ప్రస్తుతం 1715 అడుగుల మేర 27.12 టిఎంసి జలాలతో కళకళలాడుతోంది. లక్ష క్యూసెక్టులు ఇన్‌ఫ్లో వస్తుంటే, 62.57వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలేస్తున్నారు.
కృష్ణా బేసిన్‌లో
ఇక కృష్ణా బేసిన్‌లో జూరాల సామర్థ్యం 9.66 టిఎంసి కాగా, ప్రస్తుతం 8.75 టిఎంసి నీరు చేరింది. శ్రీశైలం డ్యామ్ సామర్థ్యం 885.01 అడుగులు (215.78 టిఎంసి). ప్రస్తుతం 879.60 అడుగులు (185.99టిఎంసి) నీరు చేరింది. ఇన్‌ఫ్లో 1.95 లక్షల క్యూసెక్‌లు వస్తుంటే, 75వేల 784 క్యూసెక్‌ల జలాలా కిందకి వదిలేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ 590 అడుగులు (312.05టిఎంసి). ప్రస్తుతం 516.30 అడుగుల మేర (142.62 టిఎంసి) నీరుంది. ఇన్‌ఫ్లో 66వేల 451 క్యూసెక్‌లుంటే, ఔట్ ఫ్లో 1.35 వేల క్యూసెక్‌ల జలాలు వదిలేస్తున్నారు. మూసీ సామర్థ్యం 645 అడుగులు (4.46టిఎంసి). ప్రస్తుతం 643 అడుగుల మేర (3.94టిఎంసి) నీరు ఉంది. ఇన్‌ఫ్లో 9వేల 605 క్యూసెక్‌లుంటే ఔట్ ఫ్లో 9వేల 605 క్యూసెక్‌లుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం 175 అడుగులు (45.77టిఎంసి). ప్రస్తుతం 163.71 అడుగులమేర (30 టిఎంసి) నీరు చేరింది. 5వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంటే, వచ్చిన నీటిని వచ్చినట్టే వదిలేస్తున్నారు.

చిత్రం.. భారీ వరద నీటితో కళకళలాడుతున్న జూరాల ప్రాజెక్టు