రాష్ట్రీయం

సికిందరాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరే పలు రైళ్ల రద్దు..దారి మళ్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ఆంధ్రా, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తూ, మరికొన్ని రైళ్ల రాకపోకలను మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా తెలిపారు. సికిందరాబాద్-సత్తెనపల్లి-గుంటూరు-పిడుగురాళ్ల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే జిఎం తెలిపారు. సికిందరాబాద్-గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్, సికిందరాబాద్-రేపల్లె, పిడుగురాళ్ల- సత్తెనపల్లి, గుంటూరు- మాచర్ల రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు జిఎం తెలిపారు. గూడూరు- సికిందరాబాద్, సికిందరాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-రేపల్లె ప్యాసింజర్, రేపల్లె-సికిందరాబాద్ ప్యాసింజర్, గుంటూరు-మాచర్ల ప్యాసింజర్, మాచర్ల-గుంటూరు ప్యాసింజర్‌లు రద్దయ్యాయి. ప్రస్తుతం నడుస్తున్న సికిందరాబాద్-రేపల్లె ప్యాసింజర్ మిర్యాలగూడ-రేపల్లె స్టేషన్ల మధ్య తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రైల్వే మేనేజర్ తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్-చెన్నై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను సులేహలి, గుంతకల్లు, రేణిగుంట మీదుగా మళ్లించనున్నారు. చెన్నై సెంట్రల్- హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రేణిగుంట, గుంతకల్లు, సులేహలి స్టేషన్ల మీదుగా నడిపిస్తున్నట్టు జిఎం వివరించారు. సికిందరాబాద్-్భవనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట్, రాయనపాడు, విజయవాడ బల్బ్‌క్యాబిన్, గుండాల స్టేషన్ల మీదుగా మళ్లించారు. భువనేశ్వర్-సికిందరాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ గుండాల, విజయవాడ బల్బ్‌క్యాబిన్, రాయనపాడు, కాజీపేట్, తిరుపతి-సికిందరాబాద్ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్లు, సులేహలి, పుణె-్భవనేశ్వర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట్, రాయనపాడు, విజయవాడ బల్బ్‌క్యాబిన్, గుండాల స్టేషన్ల మీదుగా సికిందరాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్ గుంటూరు, విజయవాడ, కాజీపేట్, సికిందరాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ కాజీపేట్, విజయవాడ బల్బ్‌క్యాబిన్ స్టేషన్ల మీదుగా మళ్లించామన్నారు.
రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణకు చర్యలు..
సత్తెనపల్లి-గుంటూరు-నడికుడి సెక్షన్లలో నీట మునిగిన రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్టు రవీంద్రగుప్తా తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా వారివారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం తీసుకుంటున్నట్టు చెప్పారు.