రాష్ట్రీయం

మహేశ్వరంలో 400 కెవి విద్యుత్ కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఛత్తీస్‌గడ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌ను పొందడానికి మహేశ్వరంలో ఏర్పాటు చేస్తున్న 400 కెవి విద్యుత్ కేంద్రాన్ని నిర్ణీత గడవులోగా పూర్తి చేయాలని ట్రాన్స్‌కో సిఎండి డి ప్రభాకర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌కో కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ కమర్షియల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సి సి శ్రీనివాస్‌రావు, ప్రాజెక్ట్స్ అండ్ గ్రిడ్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎస్‌జి నర్సింగ్‌రావు, ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ టి జగత్‌రెడ్డి, లిఫ్డ్ ఇరిగేషన్ స్కీమ్స్ డైరెక్టర్ జె సూర్యప్రకాశ్, ప్రాజెక్ట్స్-1 చీఫ్ ఇంజనీర్ లతా వినోద్ తదితర ఉన్నతాధికారులతో సిఎండి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పురోగతిలో ఉన్న విద్యుత్ కేంద్రాల తాజా స్థితిని సిఎండి సమీక్షించారు. చత్తీస్‌గడ్ నుంచి విద్యుత్‌ను పొందడానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పిజిసిఐఎల్) చేపట్టిన వార్థా-డిచ్‌పల్లి-హైదరాబాద్ 765 కెవి లైన్‌కు మహేశ్వరంలో ఏర్పాటు చేయనున్న 400 కెవికి అనుసంధానం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. వార్ధా-డిచ్‌పల్లి-హైదరాబాద్ లైన్ పూర్తి అయ్యేవరకు మహేశ్వరం 400 కెవి పూర్తి కావాలని సిఎండి ఆదేశించారు.లో వోల్టేజి సమస్యను అధిగమించేందుకు గజ్వేల్, వెల్టూర్, శంకర్‌పల్లి, మామిడిపల్లి, మల్కరంలో ఏర్పాటు చేస్తున్న 400 కెవి రియాక్టర్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.

నిర్మాణంలో ఉన్న విద్యుత్ కేంద్రం పనులను
పరిశీలిస్తున్న ఉన్నతాధికారుల బృందం