రాష్ట్రీయం

సరిహద్దు ఉద్రిక్తత నడుమ ఆంధ్రాలో శాంతి భద్రతల సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత నడుమ ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలను సీనియర్ పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జిల్లాల్లో నిరంతర తనిఖీలు జరగాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీలను ఆదేశించారు. అలాగే సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించాలని కూడా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. జిల్లాల్లో శాంతి భద్రతల పరిస్థితులను ఎప్పటికప్పుడు కలెక్టర్లు సైతం గమనించాలని, తదనుగుణమైన ఆదేశాలను ఇవ్వాలని సిఎం పేర్కొన్నారు. కలెక్టర్లు సైతం తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరించరాదని వ్యాఖ్యానించారు. రెండు రోజులుగా జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో శాంతిభద్రతల పరిస్థితిని కూడా సిఎం ప్రస్తావించారు. భారత సార్వభౌమాధికారానికి ఎటువైపునుండి ఎవరి నుండి భంగం వాటిల్లినా సమర్థంగా ఎదుర్కొంటామని మరోసారి రుజువు చేసిన సైనికులకు వందనమని సిఎం వ్యాఖ్యానించారు.