రాష్ట్రీయం

అన్నా వర్శిటీ అవార్డుకు దరఖాస్తులకు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐఎస్‌టిఇ) ఆధ్వర్యంలో అన్నా యూనివర్శిటీ నేషనల్ అవార్డును ఉత్తమ ఉపాధ్యాయుడికి వచ్చే నెలలో అందజేయనున్నట్టు సొసైటీ చైర్‌పర్సన్ కె లాల్ కిశోర్ చెప్పారు. దీంతో పాటు మొత్తం 16 అవార్డులను ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో టీచర్లకు అందజేస్తామని వివరించారు. యుపి గవర్నమెంట్ నేషనల్ అవార్డు, ఎస్‌జి ఎస్‌ఐటిఎస్ నేషనల్ అవార్డు, మహారాష్ట్ర స్టేట్ నేషనల్ అవార్డు, ఆర్‌పి పాటిల్ నేషనల్ అవార్డు, భారతీయ విద్యా భవన్ నేషనల్ అవార్డు సహా మొత్తం 16 అవార్డులకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్టు ఆయన చెప్పారు. వివరాలకు ఐఎస్‌టిఇఆన్‌లైన్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.