రాష్ట్రీయం

‘అగ్రిగోల్డ్’ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు హైకోర్టు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: బహిరంగ వేలం ద్వారా అమ్ముడైన అగ్రి గోల్డ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు సభ్యుల కమిటీ ద్వారా అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి, వచ్చిన సొమ్మును డిపాజిటర్లకు చెల్లించాలని హైకోర్టు గతంలోనే పేర్కొంది. అగ్రిగోల్డ్ మోసాలపై సిబిఐ విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఇప్పటికే విక్రయించిన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించాలని త్రిసభ్య కమిటీపై ఒత్తిడి ఉందని హైకోర్టు పేర్కొంది. అనంతరం ఈ కేసు విచారణను అక్టోబర్ 24వ తేదీకి వాయిదా వేశారు.