రాష్ట్రీయం

12 కేటగిరీల్లో 256 పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ శాఖల్లో ఉన్న 12 కేటగిరిల్లో 256 పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. నోటిఫికేషన్ 7/2016లో రెండు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులకు రిక్రూట్‌మెంట్ నిర్వహించనుంది. 8/2016 ద్వారా ఏడు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను, 09/2016 ద్వారా 106 మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను, 9 అసిస్టెంట్ ఇంజనీర్స్ సివిల్ పోస్టులు, 34 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తారు. 10/2016 నోటిఫికేషన్ ద్వారా 50 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎన్విరాన్‌మెంటల్) పోస్టులను, 11/2016 ద్వారా అసిస్టెంట్ హైడ్రాలజిస్టు 12 పోస్టులను భర్తీ చేస్తారు. 12/2016 నోటిఫికేషన్ ద్వారా 9 అసిస్టెంట్ హైడ్రాలజిస్టు పోస్టులు, 13/2016 నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజీ) పోస్టులు 13 భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ 14/2016 ద్వారా ఐదు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 15/2016 నోటిఫికేషన్ ద్వారా మూడు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు, 16/2016 నోటిఫికేషన్ ద్వారా ఆరు వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్టులు భర్తీ చేస్తారు. వివిధ పోస్టులకు విద్యార్హతలు, దరఖాస్తులు సమర్పించేందుకు ప్రారంభ తేదీ, ముగింపు తేదీలను సైతం పబ్లిక్ సర్వీసు కమిషన్ ప్రకటించింది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు , సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, మన్సిపల్ ఇంజనీర్లు పోస్టులకు, అసిస్టెంట్ హైడ్రాలజిస్టులు వరకూ నోటిఫికేషన్ 7 నుండి 11 వరకూ దరఖాస్తుకు అక్టోబర్ 31 వరకూ గడువు ఇచ్చారు. నోటిఫికేషన్ 12 నుండి 16 వరకూ నవంబర్ 2 వరకూ గడువు ఇచ్చారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని అధికారులు సూచించారు. అన్ని పోస్టులకు అక్టోబర్ 5 తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తులకు వీలు కల్పించనున్నారు.