రాష్ట్రీయం

నోటీసులు ఇవ్వకుండా కూల్చొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: చెరువులు, నాలాలు ఆక్రమించుకుని ఇండ్లు, కట్టడాలు నిర్మించిన వారికి రెండు వారాలు గడువు ఇస్తూ నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణను స్వీకరించాలని జిహెచ్‌ఎంసిని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ ఆదేశాలను జారీ చేశారు. నోటీసులు ఇవ్వకుండా తమ ఇండ్లను, నిర్మాణాలను జిహెచ్‌ఎంసి అధికారులు కూల్చివేస్తున్నారంటూ అనేక పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిని విచారించిన అనంతరం శుక్రవారం హైకోర్టు పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణా రెడ్డి వాదనలు వినిపిస్తూ, అక్రమ కట్టడాలను కూల్చాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు.
ఈ సందర్భంగా జడ్జి జోక్యం చేసుకుని ప్రభుత్వ ఉద్దేశాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. అక్రమ నిర్మాణాల వల్ల అనేక ప్రదేశాలు ముంపునకు గురవుతున్నాయని, వీటిని కూల్చాలన్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు పేర్కొంది. ఏజి వాదనలు వినిపిస్తూ చట్టప్రకారమే ప్రభుత్వ సిబ్బంది వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని తాము పిటిషనర్లకే పరిమితం కాకుండా అందరికీ వర్తించేటట్లు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముందుగా నోటీసులు ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలను కూల్చడం వల్ల పెద్దలు, పిల్లలు, రోగులు తీవ్ర ఇక్కట్లకు గురవుతారన్నారు. కూల్చివేతలపై తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ముందుకు పోరాదని, అలాగే బాధితులు తాజాగా ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు ఆదేశించింది.