ఆంధ్రప్రదేశ్‌

అమెరికాలో కావలి యువతి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, సెప్టెంబర్ 30: ఉన్నత చదువులు చదివి మరింత అత్యున్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అవి పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరిన కొద్ది నెలలకే కావలికి చెందిన గోగినేని ప్రియాంక(24) అనే యువతి వాషింగ్టన్ రాష్ట్రంలోని లేసి ఏరియాలో గురువారం ఉదయం దగ్గరలోని ఓ కొలనులో పడి మృతిచెందింది. వ్యాయామంకోసం నడుచుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఘటన గురువారం ఉదయం జరిగినట్లు చెబుతుండగా ఆమేరకు అమెరికాలో గల యువతి కుటుంబం తరపు బంధువులు అక్కడి ప్రభుత్వ అధికారులు భారత అధికారులకు బంధువులకు శుక్రవారం ఉదయం సమాచారం ఇచ్చారు. కావలిలో నివాసం ఉంటున్న మృతురాలి పిన తండ్రి సుబ్బారావు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్‌లో బిటెక్ పూర్తి చేసిన ప్రియాంక రెండేళ్ల క్రితం ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లాలని నిర్ణయించుకొని లేసి ప్రాంతంలోగల ఓ యూనివర్శిటీలో చేరింది. చదువు పూర్తి అయ్యి కొన్ని నెలలు కాగా అక్కడే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించింది. అయితే ప్రతిరోజూ వ్యాయామం కోసం నడుచుకుంటూ ఇంటికి సమీపంలోని కొలను వద్దకు వెళ్తుంటుంది. ఎప్పటిలాగే గురువారం కూడా కొలను వద్దకు వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తూ అందులో పడి మృతిచెందింది. కాగా మృతురాలు ప్రియాంక తండ్రి వెంకటరావు చిన్నపాటి కాంట్రాక్టరు కాగా తల్లి సత్యవతి గృహిణి. ప్రియాంకకు బిఎస్‌సి చదువుతున్న సాయి శరత్ అనే సోదరుడు ఉన్నాడు. వారు గతంలో కావలి వైకుంఠపురం, చేవూరి వారితోట ప్రాంతంలో నివసిస్తున్నారు. తమ గారాల పట్టి అకస్మాత్తుగా మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అమెరికాలో మృతి చెందిన ప్రియాంక (ఫైల్ ఫొటో)