ఆంధ్రప్రదేశ్‌

ఏపి జెన్కోకు అంతర్జాతీయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ జెన్కో సాధిస్తున్న అభివృద్ధి, అనుసరిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఢిల్లీకి చెందిన ఆర్థిక అధ్యయన సంస్థ ప్రకటించిన అంతర్జాతీయ నాయకత్వ ఆవిష్కరణ సమర్థత (ఇంటర్నేషనల్ లీడర్‌షిప్ ఇన్నోవేషన్ ఎక్స్‌లెన్స్) అవార్డును ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో, జెన్కో సిఎండి కె విజయానంద్‌కు ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తిలో ఏపి జెన్కో సాధించిన అభివృద్ధి, ప్రగతికి గుర్తింపుగా బంగారు పతకం కూడా లభించింది. ఆదివారం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ఇండో థాయ్ ఎకనమిక్ కో ఆపరేషన్ సెమినార్‌లో ఈ అవార్డులను ఆ దేశ మాజీ ప్రధాని కోర్న్ డబ్రాని, కొసావో దేశం రిపబ్లిక్ కౌన్సిల్ డాక్టర్ మామ్ లాంగ్ రాజదరస్రీ జయాంకుర, థాయిలాండ్ దేశానికి చెందిన భారత రాయబారి భగవంత్ సింగ్ భిష్మాయ్ చేతుల మీదుగా ఏపి జెన్కో, ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ అందుకున్నారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత రెండేళ్లలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు తెలిపారు. విద్యుత్ రంగానికి సంబంధించి దేశంలో అత్యున్న సంస్థలైన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, సెంట్రల్ పవర్ యుటిలిటీస్, ఎనర్షియా ఫౌండేషన్‌లు ఏపి జెన్కోను అత్యుత్తమ విద్యుత్ సంస్థగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఏపి జెన్కోకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన విజయానంద్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు.