ఆంధ్రప్రదేశ్‌

కాలేజీ విద్యార్థులకు వెల్‌నెస్ క్లినిక్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: ఆంధ్రప్రదేశ్‌లో కాలేజీ విద్యార్థులకు వెల్‌నెస్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, వికాసం, విజ్ఞానం, జబ్బులపై ముందస్తు అవగాహన కల్పించేందుకు వెల్‌నెస్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని అన్నారు. పొగాకు, మద్యం, మత్తుమందుల వాడకం వల్ల ఆరోగ్యానికి హాని చేసి, పునరుత్పత్తి అవకాశాలు దెబ్బతింటాయని ఈ క్లినిక్‌ల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. మంచి ఆహారపు అలవాట్ల ద్వారా మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని వైద్యులు సూచిస్తారని పేర్కొన్నారు. ఆయుష్ విభాగాన్ని కూడా ఈ క్లినిక్‌లకు అనుసంధానం చేసి విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంచనున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజలందరికీ బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఈ అంశంపై 17వ తేదీన ఒక సమావేశాన్ని వెలగపూడిలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అనంతపురంలో డయాలసిస్ యూనిట్ ప్రారంభిస్తామని, 15 రోజుల్లో రాష్ట్రంలో కొత్తగా 75 అంబులెన్స్‌లు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఇ-యుపిహెచ్‌సిలను సీరియస్‌గా నిర్వహిస్తామని చెప్పారు. అల్లోపతితో ఆయుష్‌ను అనుసంధానం చేస్తామని, చంద్రన్న సంచార చికిత్సపై సమీక్షిస్తామని వివరించారు. గత నాలుగైదు నెలల్లో 12.63 లక్షల మంది రోగులకు వైద్య సేవలు అందించామని చెప్పారు. ఇందులో 4 లక్షల మందికి మందులు ఇచ్చామని పేర్కొన్నారు.