ఆంధ్రప్రదేశ్‌

చిన్నశేష వాహనంపై చిద్విలాసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 4: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన మంగళవారం ఉదయం శ్రీమలయప్పస్వామి చిరుజల్లులు కురుస్తుండగా పటాటోపం చాటున ఐదు తలల చిన్నశేష వాహనంపై బదరీనారాయణుని రూపంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య భక్తులు నృత్యాలు, భజనలు, జియ్యంగార్ల ,వైష్ణవ స్వాముల వేదమంత్రాలతో చిన్నశేష వాహనం మలయప్పస్వామి విహారం ఆద్యంతం రసరమ్యంగా సాగింది. ఓ వైపు చిరుజల్లుల్లో తడుస్తూనే భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు పడుతూ చేసిన గోవింద నామస్మరణతో తిరుమల మారుమోగింది. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు.

మంగళవారం రాత్రి హంస వాహనంపై
తిరుమల మాడవీధుల్లో భక్తులను అనుగ్రహిస్తున్న దృశ్యం