రాష్ట్రీయం

ఇక్కడే తాత్కాలిక సచివాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, డిసెంబర్ 27: నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగరంలో భవన నిర్మాణాలు సుమారు మూడు నాలుగేళ్లుపట్టే అవకాశం ఉంటడంతో మంగళగిరి సమీపంలోని అమరావతి టౌన్‌షిప్ ప్రాంగణంలో తాత్కాలిక సచివాలయం, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే జూన్‌నుంచి పరిపాలనంతా కొత్త రాజధాని నుంచే జరపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలన్నీ విజయవాడ, మంగళగిరి, గుంటూరు పరిసరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులను కూడా జూన్‌కల్లా కొత్త రాజధానికి వచ్చేందుకు సిద్ధం కావాలని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో సుమారు 6 లక్షల చదరపు అడుగుల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి వచ్చే నెలచివరి వారంలో టెండర్లు పిలవనున్నట్టు సమాచారం. మంగళగిరి పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూర్వపు విజిటియం ఉడా రూపొందించిన అమరావతి టౌన్‌షిప్ ప్రాంగణాన్ని తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి ఎంపిక చేశారు. నాలుగు మాసాల వ్యవధిలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో త్వరితగతిన దీన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం కొత్త రాజధానిలో భవన నిర్మాణాలు పూర్తయ్యే వరకు వీటిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా కృష్ణానదీ తీరాన రాజధాని నిర్మాణానికి గత అక్టోబర్‌లో ప్రధాని మోదీ చేతులమీదుగా శంకుస్థాపన గావించారు. రాజధానిలో భవన నిర్మాణ పనులు వచ్చే జూన్‌నుంచి ప్రారంభమవుతాయని చెబుతున్నారు. మరోవైపు ఆచార్య నాగార్జున వర్శిటీ ఎదుట కాజ గ్రామ పరిధిలో ఐజెఎం లింగమనేని గ్రూప్ నిర్మించిన విల్లాస్‌లో ఇప్పటికే కొందరు మంత్రులు నివాసాలు ఏర్పరచుకున్నారు. జూన్‌నాటికల్లా పూర్తిస్థాయిలో మంత్రుల నివాసాలు, తాత్కాలిక రాజధాని ఏర్పాటు పనులు పూర్తికానున్నట్టు అధికారవర్గాల సమాచారం.

చిత్రం... మంగళగిరి సమీపంలో తాత్కాలిక సచివాలయం నిర్మించనున్న స్థలం