రాష్ట్రీయం

పత్రికల్లో గాడి తప్పుతున్న తెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: ప్రజామాధ్యమాల్లో తెలుగు వినియోగం గాడితప్పుతోందని, అవసరమైన మేర వేగంగా తెలుగు ఎదగడం లేదని, కొత్త పదాలు, పద బంధాలు, సమానార్ధక పదాల సృష్టి జరగడం లేదని పలువురు సంపాదకులు, భాషా శాస్తవ్రేత్తలు, నిపుణులు, సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. వయోధిక పాత్రికేయ సంఘం ఆదివారంనాడు ప్రెస్‌క్లబ్‌లో పదేళ్ల పండుగను నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఎపి ప్రెస్ అకాడమి అధ్యక్షుడు వి వాసుదేవ దీక్షితులు, తెలంగాణ ప్రెస్ అకాడమి అధ్యక్షుడు అల్లం నారాయణ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు భాషకు, జర్నలిజానికి సంబంధించిన పలు అంశాలపై ప్రముఖులు మాట్లాడారు.
‘తెలుగులో వార్తారచన.. నాడు- నేడు’ అంశంపై డాక్టర్ కె రామచంద్రమూర్తి, ‘సంపాదకీయాలు.. అప్పు డు- ఇప్పుడు’ అంశంపై కల్లూ రి భాస్కరం, ‘తెలుగులో నూతన పదజాల సృష్టి’ అంశంపై జి శ్రీరామమూర్తి, ‘్ఫచర్సు’పై ఆర్వీ రామారావు, ‘పత్రికా రచన-బోధన- శిక్షణ’ అంశంపై డాక్టర్ గోవిందరాజు చక్రధర్, ‘్భష- శైలి’ అంశంపై ఎంవిఆర్ శాస్ర్తీ, ‘రేడియోలో తెలుగు వికాసం’ పై డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ, ‘శాస్త్ర సాంకేతిక విజ్ఞానం -తెలుగు పదజాలం’ అనే అంశంపై డాక్టర్ కెబి గోపాలం, ‘తెలుగు సినిమాల్లో భాష’ అంశంపై రావి కొండలరావు మాట్లాడారు.
ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడుతూ నేడు పత్రికల్లో భాషాదోషాలు సర్వసాధారణమైపోయాయని, వాడకూడని ఎన్నో పదాలను పత్రికలు వాడుతున్నాయని, పత్రికాపద సంపద తెలుగులో అవసరమైన మేర సృష్టి కావడం లేదని చెప్పారు. డిగ్రీల కంటే పత్రికారంగంలో రాణించాలంటే మిగిలిన వారు రాసింది చదవాలని, కొత్త పదాలు, భాష, శైలిని అలవరచుకోవాలని సూచించారు. ప్రముఖ రచయితలు, కవులు సైతం తప్పులు రాస్తున్నారని, తెలుగు పత్రికారంగంలో పాత్రికేయులు చేస్తున్నపాటి కృషిని కూడా భాషావేత్తలు, విశ్వవిద్యాలయాలు, అకాడమీలు చేయడం లేదన్నారు. ఆంగ్లంలో పలు మాటలకు అర్ధాలు చెప్పగలుగుతున్నా సమానకార్ధాలను మాత్రం చెప్పలేకపోతున్నారని, సమగ్ర భాషాకోశం తయారుకావాలని చెప్పారు. పదసృష్టికి అంకితభావం కావాలని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అనేక కొత్త పదాలు ఆంగ్లంలో వస్తున్నాయని, వాటన్నింటికీ తెలుగులో సరైన సమానార్ధక పదాలు లేవని చెప్పారు. పత్రికల బాధ్యత సమాచారం ఇవ్వడమే అయినా తెలుగు భాషా వికాసానికి ఎనలేని కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధి అందరి బాధ్యత అంటూ నేటి యువ పాత్రికేయులు దృష్టి పెడితే, వృత్తిపట్ల గౌరవం , తపన ఉంటే అద్భుతమైన జర్నలిస్టులు కావడానికి అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు.
జర్నలిజం కోర్సును ఐదేళ్ల వ్యవధికి పెంచాలని గోవిందరాజు చక్రధర్ సూచించారు. మీడియా సంస్థలు ఫెలోషిప్‌లు పెట్టాలని, ప్రాంతీయ భాషల్లో ప్రోత్సాహం పెరగాలని, సిలబస్‌ను ఎప్పటికపుడు అప్‌డేట్ చేయాలని సూచించారు. పిఎస్ గోపాలకృష్ణ మాట్లాడుతూ రేడియోలో తెలుగుభాష చరిత్రను వివరించారు.
ఇతరులపై ఆధారపడి వార్తలు రాయడం సరైన పద్ధతి కాదని, జర్నలిస్టు నిరంతరం ప్రత్యక్షంగా చూసి రాయాలని కె రామచంద్రమూర్తి అ న్నారు. మీడియా- రాజకీయ పక్షా ల అనుబంధంపై విమర్శలు ఉన్నాయని అన్నారు. అయితే 20 పేజీల పత్రికలో రాజకీయ వార్తలు 20 శాతం ఉంటాయని మిగిలిన అంశాలు ఎన్నో ఉంటాయని తెలిపారు. నిజాలు, నిష్పక్షపాతంగా రాసినప్పుడే విలేఖరికి గౌరవం, విలువ ఉంటుందని అన్నారు. ముట్నూరు కృష్ణారావు, నార్ల వెంకటేశ్వరరావుల కాలం నుంచే సంపాదకీయాల ప్రాధాన్యత తగ్గిపోతుందనే ఆవేదన వ్యక్తం అయిందని కల్లూరు భాస్కరం అన్నారు. ‘సంపాదకీయాల విలువ పడిపోతుందని గతంలో అభిప్రాయం ఉండేది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులోనూ ఉంటుంద‘ని ఆయన అన్నారు. ముట్నూరు కృష్ణారావు, ఎబికె ప్రసాద్, నార్ల వెంకటేశ్వరరావు, ఎంవిఆర్ శాస్ర్తీ, వాసుదేవ దీక్షితులు, పతంజలి, పొత్తూరు వెంకటేశ్వరరావు, రామచంద్రమూర్తిల సంపాదకీయ శైలిని ప్రస్తావించారు. సమావేశానికి భండారు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సీనియర్ పాత్రికేయులను వరదాచారి సత్కరించారు.
జర్నలిజం వృత్తిలో ఉండే వారు నిరంతరం చదువుతూ, సమాజాన్ని గమనిస్తూ ఉండాలని పలువురు లబ్దప్రతిష్టులైన జర్నలిస్టులు సూచించారు. నేడు పత్రికా రంగం అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటోందని, సమాజం కోసం స్పందించే గుణం ఉన్న వాళ్లే ఈ రంగంలో నిలదొక్కుకుంటారని అన్నారు. సంపాదనే ముఖ్యంగా భావించే వాళ్లు జర్నలిజం కోర్సు చేసినా రెండు మూడేళ్లకు మించి ఈ రంగంలో ఉండలేరని అన్నారు.
కొత్త కమిటీ
వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడిగా జిఎస్ వరదాచారి, ఉపాధ్యక్షులుగా గుడిపూడి శ్రీహరి, టి ఉడయవర్లు, సంయుక్త కార్యదర్శులుగా బి సాంబశివరావు, భండారు శ్రీనివాసరావు, కోశాధికారిగా నందిరాజు రాధాకృష్ణ, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా కూచి గోపాలకృష్ణ, దాసు కేశవరావు, పి శరత్‌కుమార్, ఎన్ శ్రీనివాసరెడ్డి, కెబి లక్ష్మి, సిహెచ్ రాజేశ్వరరావు, విఎన్ హరినాధ్, ఎవి జనార్దనరావు ఎన్నికైనట్టు కార్యదర్శి కె. లక్ష్మణరావు తెలిపారు.

చిత్రం... వయోధిక పాత్రికేయ సంఘం ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన
పదేళ్ల పండుగలో మాట్లాడుతున్న ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ