రాష్ట్రీయం

జాడలేని స్థలాల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 27: ప్రభు త్వం ప్రకటించిన మాస్టర్ ప్లాన్ లో స్థలాల కేటాయింపుపై స్పష్టత లేకపోవడంతో రైతులు కలవరపడుతున్నా రు. శనివారం రాత్రి మాస్టర్‌ప్లాన్ ము సాయిదా విడుదలైనట్లు తెలుసుకున్న రైతులు తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయం చుట్టూ ఆదివారం ప్రదక్షిణలు చేశారు. కొంతమంది సిబ్బంది వచ్చినప్పటికీ మాస్టర్‌ప్లాన్ కాపీని చూపించలేదని రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా రైతులు కొంతమంది మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణను అమలుచేసిన సమయంలో రైతులకు స్థలాల కేటాయిం పు సంతృప్తిపరిచే విధంగా ఉంటుందన్నారని, ప్రస్తుతం ప్రణాళికలో ఆ అంశాన్ని పొందుపర్చలేదని వస్తున్న వార్తలతో ఆందోళన కలుగుతోందన్నారు. వెంకటపాలెం గ్రామానికి చెందిన రైతు డి వెంకటేశ్వర్లు ఆదివారం మాట్లాడుతూ తమని తన్ని తోలేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మాస్టర్‌ప్లాన్‌లో ఎక్కడా స్థలాలను చూపించక పోవడాన్ని వెంకటపాలెం సిఆర్‌డిఎ కార్యాలయంలో గమనించిన రైతు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తంచేశారు. మంత్రి నారాయణ స్వయంగా గ్రామానికి కిలోమీటరు లోపు స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చి.. ప్రస్తుతం ఎక్కడ ఇస్తారో తేల్చకుండా వదిలి వేయడంపై ఆందోళనగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సభలో రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నప్పటికీ, ఆచరణలో అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత వారం తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయానికి సమాచార కమిటీ వచ్చిన సమయంలో రైతులు కొందరు అధికారులను కలిసి స్థలాల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రానున్న రెండు మూడు రోజుల్లో మాస్టర్ ప్లాన్ ముసాయిదా విడుదల అవుతున్న దృష్ట్యా రైతులకు స్థలాలు ఎక్కడ కావాలో తెలియజేయాలని కమిటీ సభ్యులు కోరారు. అయితే ప్రణాళిక ఎలా ఉంటుందో తెలియకుండా స్థలాలు ఎక్కడ కావాలని ప్రశ్నిస్తే తమ వద్ద నుంచి సమాధానం ఎలా వస్తుందని కమిటీ సభ్యులను గ్రామస్థులు ఎదురు ప్రశ్నించారు.
అంతేకాకుండా భూ సమీకరణ జరుగుతున్నప్పుడు మంత్రులు గ్రామాల్లోని నాయకులను కలిసి సజావుగా కార్యక్రమం కొనసాగేందుకు సహకరించాలని పదే పదే కోరారన్నారు.
అయితే జన్మభూమి కమిటీ మినహా రాజధానికి సంబంధించిన వ్యవహారాల్లో తమ జోక్యం లేకుండానే అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ఫలితం లభించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శంకుస్థాపన, భూమిపూజ తదితర కార్యక్రమాల్లో భూములిచ్చిన రైతులకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరించిన రైతులకు ఇంతవరకు మాస్టర్ ప్లాన్‌లో స్థలాలు ఎక్కడ ఇస్తారనే విషయంపై స్పష్టత ఉండాలని కమిటీ ముందు రైతులు వెల్లడించారు. తొలి నుంచి రాజధానికి సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు తెలియజేయాలని కోరుతున్నప్పటికీ ఇంతవరకు ఆ దిశగా నిర్ణయాలు జరగలేదన్నారు. ఇప్పటికైనా ప్రతి గ్రామంలో కనీసం ఐదుగురు సభ్యులతో కమిటీ వేసి ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే దిశగా అధికారులు యత్నించాలని కోరారు.