రాష్ట్రీయం

తిరుమలలో చలి పులి గజగజలాడుతున్న భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 27: తిరుమలలో చలి తీవ్రత పెరగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆస్త్మాతో బాధ పడుతున్న భక్తులు, వృద్ధులు, పిల్లల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారా యి. ఆదివారం ఉదయం 10 గంట లు దాటినా సూర్యకిరణాల ప్రభావం మబ్బులమాటున ఉన్నాయంటే తిరుమలలో చలి తీవ్రత ఏమేరకు ఉందో ఇట్టే అర్థమవుతోంది. కాగా చలి పెరగడంతో భక్తులు గదులకే పరిమితం అవుతున్నారు. సర్వసాధారణంగా రద్దీ సమయంలో ఉదయం 6 గంటల నుండి అర్థరాత్రి దాటేంత వరకు తిరుమలలోని బజార్లు భక్తులతో సందడిగా ఉంటాయి. అయితే ఈ చలి కారణంగా భక్తులు కాటేజీలు వదలి రావడానికి సాహసించలేక పోతున్నారు. దీంతో ఉదయం 10 గంటల వరకు కూడా భక్తులు రోడ్డుపైకి రావడంలేదు. ఇక రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటలలోపే బజార్లు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. వ్యాపారులు కూడా వ్యాపారాలు లేక దిగాలు పడుతున్నారు. ఇదిలావుండగా జనవరి 10వ తేదీ వరకు తిరుమలలో ఈ చలి తీవ్రత ఉండే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.