రాష్ట్రీయం

ఆరోగ్యశ్రీ అటకెక్కింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయని, అందువల్ల ఈ రంగంపై తక్షణమే శే్వతపత్రం ప్రకటించాలని టి-జాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. విద్య-వైద్యం అంశంపై టిజాక్ గురువారం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం తర్వాత కోదండరాం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదని, విద్య, వైద్య రంగాలకు కూడా నిధులు సకాలంలో ఇవ్వడం లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు అర్థమవుతోందని అన్నారు. గత రెండేళ్లుగా ఆరోగ్య శ్రీ పథకానికి సకాలంలో నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఈ పథకం కింద చెల్లించాల్సిన 640 కోట్ల రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయన్నారు. గత ఏడాది కాలంలో బకాయిల కోసం రెండు పర్యాయాలు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మె చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కావడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో గత 15 రోజులుగా హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అనేక ఆసుపత్రుల్లో వైద్య సేవలు సరిగ్గా అందడం లేదన్నారు. ‘విభజించు-పాలించు’ అన్న సూత్రాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసిన ఆసుపత్రులకు నిధులను విడుదల చేయకుండా, తమకు ఇష్టం వచ్చిన వారికి పూర్తిగా నిధులు ఇస్తోందని ఆరోపించారు. ఇటీవల వైద్య శాఖ మంత్రి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చల పేరుతో పిలిచి బెదిరించారని ఆరోపించారు. ఇది సరైన విధానం కాదన్నారు. విద్యార్థులకు ఫీ రీయింబర్స్‌మెంట్ కింద 3,068 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా, కేవలం 928 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారని కోదండరాం పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు.