రాష్ట్రీయం

చంద్రబాబు ఒక్కరికే చెబితే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: ఆదాయం వెల్లడి పథకం కింద సేకరించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరికే కేంద్రం అందిస్తే సరిపోదని, అందరికీ అందుబాటులో ఉంచాలని కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. ఈ స్కీం కింద నల్లధనాన్ని అప్పగించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కేంద్రం పలుసార్లు ప్రకటించిందన్నారు.
జాతీయ స్థాయిలో నల్లధనంలో తెలుగు రాష్ట్రాల వాటా 20 శాతం ఉన్నట్లు లెక్కలు తేలాయన్నారు. ఒక రాజకీయ నేత పదివేల కోట్ల రూపాయలను ఐటి శాఖకు అప్పగించారని ఒకరంటే, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లధనాన్ని మార్చుకున్నారని రాష్ట్ర మంత్రులు ప్రకటనలు చేశారన్నారు. దేశంలో ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు బహిరంగంగా వివరాలను వెల్లడిస్తే ఇక గోప్యత అనవసరమన్నారు. ఎంపిక చేసుకున్న వారికే వివరాలు అందించడం భావ్యం కాదన్నారు. కేంద్రానికి ఏ మాత్రం జవాబుదారీతనం, పారదర్శకత ఉన్నా ఆదాయం వెల్లడి పథకం కింద వివరాలు ఇచ్చిన వారి జాబితాను అందరికీ తెలియచేయాలన్నారు.