ఆంధ్రప్రదేశ్‌

ఆ నిర్ణయం నాదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: రాష్ట్ర ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు తాను చేపట్టిన సుదీర్ఘమైన పాదయాత్రలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద కాపు సామాజికవర్గాన్ని వెనుకబడిన తరగతుల్లో చేర్చేందుకు తాను స్వయంగా సంసిద్ధత వ్యక్తం చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం నోవా ఇంజనీరింగ్ కాలేజి ఆవరణలో మూడు రోజులుగా జరుగుతున్న కాపు మెగా జాబ్‌మేళాలో శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన కాపు యువతకు నియామక పత్రాలను ఆయన అందజేశారు. కాపులను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలని తమకు ఎవరి నుంచి డిమాండ్ రాలేదని, తమంతట తామే ఆ సామాజికవర్గ వెనుకబాటుతనం గమనించి ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. కాపు సామాజికవర్గాన్ని సామాజికంగా, ఆర్ధికంగా, ముందుకు తేవాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమన్నారు. సామాజికంగా ఈ వర్గం వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు మంజునాధ కమిషన్‌ను నియమించామని గుర్తు చేశారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవోను జారీచేయడం తేలికైన పనేనని, అయితే ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించి జీవోను నిలుపుదల చేయించవచ్చన్నారు.
కాపు సామాజిక వర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వివిధ కార్పొరేట్ సంస్థలను ఆహ్వానించామన్నారు. సుమారు ఆరువేల ఉద్యోగాలను ఈ సంస్థల ద్వారా నోటిఫై చేయడం జరిగిందన్నారు. గత రెండు రోజులుగా సుమారు రెండువేల మందిని వివిధ సంస్థలు ఉద్యోగాలకు ఎంపిక చేయడం తమకు సంతోషంగా ఉందన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తులు, సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే కాపు సామాజికవర్గం అన్ని విధాలా నష్టపోయిందని, ఇటువంటి శక్తుల ఉచ్చులో పడి ఆ సామాజిక వర్గాన్ని మరింత నష్టానికి గురిచెయ్యొద్దని ముఖ్యమంత్రి కోరారు.

చిత్రం....... జాబ్ మేళాలో ఎంపికయిన అభ్యర్థులకు పత్రాలు అందజేస్తున్న చంద్రబాబు