రాష్ట్రీయం

దేశంలో సాలీనా 17 లక్షల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రపంచ స్ట్రోక్ కాంగ్రెస్ సమావేశాలు ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు వరల్ట్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుఎస్‌ఓ) అధ్యక్షుడు స్టీఫెన్ డేవిస్, భారత్ నుంచి ఈ సదస్సుకు కో-చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జయరాజ్ పాండియన్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కనె్వంన్షన్ సెంటర్‌లో నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సును తెలంగాణ వైద్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభిస్తారు. భారత్‌లో సాలీనా 1.7 మిలియన్ల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయని స్టీఫెన్ డేవిస్ చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు చికిత్స అందించేందుకు దేశంలోని చాలా ఆసుపత్రుల్లో ఎటువంటి పరికరాలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ హైపర్ టెన్షన్ లీగ్, ఆసియా పసిఫిక్ స్ట్రోక్ ఆర్గనైజేషన్, యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్, అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరో హ్యాబిలిటేషన్, అకాడమీ ఆఫ్ న్యూరాలజీ సంస్ధలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కార్యదర్శి డాక్టర్ విజి.ప్రదీప్ మాట్లాడుతూ, ఈ సదస్సులో ట్రైనీ న్యూరాలజిస్టులు, నర్సులు, ఫిజియో థెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, స్పీచ్ థెరపిస్టులు కూడా పాల్గొంటారని చెప్పారు. దక్షిణాసియాలో బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని నిమ్స్ డీన్ డాక్టర్ సుబాష్ కౌల్ తెలిపారు.