రాష్ట్రీయం

ఆత్మరక్షణార్థమే కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: ఒడిశాలోని మల్కన్‌గిరిలో అక్టోబర్ 24వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్లో ఆత్మరక్షణార్ధం మాత్రమే పోలీసులు మావోయిస్టులపై కాల్పులు జరిపారని ఏపి ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తమ రాష్ట్ర పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. మావోయిస్టులు తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా, కాల్పులు జరిపారని, దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం కాల్పులకు దిగాల్సి వచ్చిందని హైకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పౌర హక్కులల సంఘం నేత సి చంద్రశేఖర్ దాఖలుచేసిన పిల్‌పై విచారణ జరిగింది. తమ పరిధిలోకి రాకపోయినా, ఆంధ్ర గ్రేహౌండ్స్ పోలీసులు మల్కన్‌గిరి ప్రాంతంలోకి వెళ్లి మావోయిస్టులను కాల్చి చంపారని పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశం మేరకు విశాఖపట్నం గ్రామీణ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. కేంద్రం సాయుధ బలగాలను నియమించిందని, వారికి సహకరించాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరిందన్నారు. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా చిత్రకోట ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అనంతరం ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.