రాష్ట్రీయం

దేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 2: దేశాన్ని, రాష్ట్రాన్ని అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కృషి చేయాలని విశ్వంజీ విశ్వంభర యోగి మహరాజ్ పిలుపునిచ్చారు. విజయవాడ ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజిలెన్స్ అవేర్‌నెస్ వారోత్సవాల్లో భాగంగా ‘దైనందిన జీవితంలో నీతి నిజాయితీ నైతిక విలువలు’ అనే అంశంపై బుధవారం నగరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో స్వామీజీ మాట్లాడారు. ఆదాయపు పన్ను శాఖ మంచి ఆలోచనతో ఈ సదస్సు నిర్వహిస్తోందంటూ అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠంగా పనిచేస్తున్నాయంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు, ఉద్యోగులే కారణమన్నారు. దేశాన్ని శక్తిమంతం చేస్తారని ప్రధాని పీఠంపై మోదీని కూర్చోపెట్టారన్నారు. ఆయన కూడా ప్రజలను శక్తిమంతులుగా తీర్చిదిద్దాలన్నారు. కొన్ని సంస్కరణల వల్లే ఆర్థిక ఇబ్బందులు రాలేదని, అమెరికా కూడా ఇబ్బందుల్ని ఎదుర్కొందని గుర్తుచేశారు. ప్రతిరోజూ గురువుకు, తల్లితండ్రులకు నమస్కరించాలని, సనాతన ధర్మం మానవతా విలువలను చాటిచెప్పిందన్నారు. దేహమే దేవాలయమని, హృదయమే దైవపీఠమని గుర్తించాలన్నారు. మనస్సులో శాం తిని నింపుకుని భగవంతుని ఆరాధించాలని తెలిపారు.
ధర్మంగా, చట్టబద్ధంగా సంపాదించిన ధనాన్ని సమాజానికి వినియోగించడం ద్వారా శక్తిమంతం చేయాలన్నారు. నీతి, నిజాయతీ మనిషిని శక్తిమంతునిగా తీర్చిదిద్దుతాయని, తద్వారా దేశం కూడా శక్తిమంతం అవుతుందన్నారు. పిల్లల్లో మానవతా విలువలు పెంపొందించాలని, దేశంలోని వివాహ వ్యవస్థ ఛిన్నాభిన్నం కాకుండా కాపాడుకోవాలని కోరారు. ఉగ్రవాదుల కళ్లు అమెరికా, భారత్‌పై ఉన్నాయని, ఈ రెండు దేశాల మధ్య సఖ్యతను చెరిపేయాలని చూస్తున్నారన్నారు. ఐక్యంగా, ప్రజలంతా వసుధైక కుటుంబంగా జీవించాలని విశ్వంజీ ఉద్ఘాటించారు. కార్యక్రమంలో ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ పిఎస్‌పి చౌదరి, అసిస్టెంట్ కమిషనర్ వడ్డాది అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా చిన్నారులు ఆలపించిన భక్తిగీతాలు అలరించాయి.

చిత్రం... సదస్సులో మాట్లాడుతున్న విశ్వంజీ మహరాజ్