రాష్ట్రీయం

అమరావతికి తరలివస్తున్న అంతర్జాతీయ విద్యాసంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 3: నవ్యాంధ్ర రాజధానిలో 15 అంతర్జాతీయ విద్యాసంస్థలు నెలకొల్పేందుకు విద్యావేత్తలు ముందుకొచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విట్‌కు శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సమాచార, సాంకేతిక రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి జరుగుతోందని చెప్పారు. ‘విద్యార్థులను చూస్తుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. స్టూడెంట్స్ ఎక్కడ ఉంటే అక్కడ డైనమిజం ఉంటుంది. చదువు బాధ్యత ప్రభుత్వానిది. పిల్లలూ.. మీకు అపారమైన తెలివితేటలు ఉన్నాయి. అవకాశాలు వస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మీలో ఉంది. రాష్ట్భ్రావృద్ధిలో మీరూ భాగస్వాములు కావాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. విట్‌ను స్థాపించిన తొలి ఏడాదిలో 120మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడు 32వేల మంది విద్యనభ్యసిస్తున్నారని వివరించారు. మన రాష్ట్రం నుంచే 5వేల మంది విద్యార్థులు ఉన్నారని, ఈ సంస్థ ఇక్కడే ఉంటే మరింత ఎక్కువమందికి అవకాశాలు లభిస్తాయన్నారు. చిన్న నిర్ణయంతో అత్యధిక ఫలితాలు సాధించే దిశగా నూతన అనే్వషణలు రావాలన్నారు. ఎస్‌ఆర్‌ఎం ఏర్పాటుతో 50వేల మందికి, అమృతా విశ్వవిద్యాలయం ద్వారా 47వేల మందికి, ఎయిమ్స్‌లో 2వేల మందికి, విట్‌లో 30వేల మందికి పైగా విద్యనభ్యసించే వీలు కలుగుతుందన్నారు. త్వరలో ఫ్రాంక్‌ఫర్ట్ లాంటి ప్రపంచ విశ్వవిద్యాలయాల శాఖలను కూడా రాజధానిలో ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, వ్యాపారం, వ్యవసాయం ద్వారా కరవును జయించగలమన్నారు. చిన్నచిన్న సమస్యలను పరిష్కరించామని, ఇక పెట్టుబడులపై దృష్టి సారిస్తామన్నారు. ఒకవైపు అభివృద్ధి జరుగుతుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అడ్డుపడుతున్నాయని, ప్రజల్లో విశ్వసనీయత ఉన్నంత వరకు వెనకడుగువేసే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. ‘నాపై గురుతర బాధ్యత ఉంది. మీ ఆలోచనలలో మార్పురావాలి. మంచి చెడులను విశే్లషించుకోవాలని ఉద్బోధించారు. ఏడాదిలో అమరావతి రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.