రాష్ట్రీయం

పెట్టుబడులతోనే సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 3: వ్యాపారంతోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని, సంపద పెరగాలంటే పెట్టుబడులను ఆహ్వానించక తప్పదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, కమ్యూనిస్టు చైనా దేశాలు సైతం పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాయని ఉదహరించారు. సంపద పెరగాలంటే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ తప్పనిసరన్నారు. దేశం ముందుకెళ్లాలంటే రాష్ట్రాలు పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం ఏపి రాజధాని అమరావతిలో శాఖమూరు-ఐనవోలు గ్రామాల మధ్య ప్రతిష్ఠాత్మక వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వెంకయ్య మాట్లాడారు. దేశంలో విశిష్ఠ గుర్తింపుపొందిన విద్యాసంస్థల్లో ‘విట్’ ఒకటన్నారు. అధునాతన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం పురోగమిస్తున్నప్పటికీ 35 శాతం నిరక్షరాస్యులు ఉండటం విచారకరమన్నారు. పోటీ ప్రపంచంలో దేశ, రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలన్నారు. దేశంలో విద్యాప్రమాణాల మెరుగుదలకు జాతీయ నూతన విద్యావిధానాన్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోందన్నారు. ఐదు అంశాలతో కూడిన ఈ విద్యావిధానంపై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చ జరగాలన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేస్తోందని చెప్పారు. ‘ఏటా లక్షలాది మంది విదేశాలకు వెళ్తున్నారు. ఎక్కడ ఉన్నా మాతృభూమి, మాతృభాషను కన్నతల్లిలా ఆందరించాలి’ అని హితవు పలికారు. మరో ఐదేళ్లలో ప్రవాస భారతీయులకు విదేశాల్లో ఉన్న అవకాశాలు ఇక్కడే అందుబాటులోకి వస్తాయనే ఆశాభావాన్ని వెంకయ్య నాయుడు వ్యక్తం చేశారు.

చిత్రం.. అమరావతిలో విట్‌కు శంకుస్థాపన చేస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు