రాష్ట్రీయం

ఏడాదిలో కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: మిషన్ కాకతీయ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ఏడాది కాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. వచ్చే యాసంగి పంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే రైతుల పొలాలకు నీళ్లందించి తీరాలని నిర్ణయించింది. ఒకవైపు కాళేశ్వరంకు జాతీయ హోదా కోసం ప్రయత్నాలు సాగిస్తూనే మరోవైపు ప్రాజెక్టును ఏడాది కాలంలో పూర్తిచేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తన శాఖ ఉన్నతాధికారులతో గురువారం ప్రత్యేకంగా సమావేశం అయి రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు జరుగుతున్న తీరుపై సుదీర్ఘంగా సమీక్షించారు. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్టత్రో ఒప్పందం తరువాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఏడాది కాలంలో పూర్తి చేయడానికి అవసరం అయిన ఏర్పాట్లు అన్నీ ముందే చేశారు. చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టును యేడాదిలో పూర్తిచేసి ఆసియాలోనే సరికొత్త రికార్డు నెలకొల్పాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు నుంచి 2017 డిసెంబర్ నాటికి గోదావరి జలాలను తెలంగాణ పొలాలకు తరలించాలని అన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, విద్యుత్, గనులు తదితర ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో పని చేసి నిర్ణీత గడువులో ప్రాజెక్టు పూర్తి చేయాలని అన్నారు. భూ సేకరణ పనులను మరింత వేగవంతం చేసి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేలా చూడాలని చెప్పారు. భూసేకరణ ప్రక్రియలో ఇంజనీర్‌లానే కాకుండా తహసిల్దార్‌లా కూడా నిరంతరం పని చేశారని కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ ఎన్ వెంకటేశ్వర్లును మంత్రి అభినందించారు. సిఇ కృషి మిగతా అధికారులకు స్ఫూర్తి దాయకంగా ఉందని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పనులు రెండు వారాల్లో ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. అన్నారం, సందిళ్ల బ్యారేజీ పనులు నవంబర్ 15న ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మూడు బ్యారేజీలతో పాటు పంప్ హౌజ్‌ల పనులను కూడా ఏక కాలంలో సమీకృతంగా చేపట్టాలని హరీశ్‌రావు సూచించారు. కనె్నపల్లి పంప్ హౌజ్ పనులు ప్రారంభించినట్టు, కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైనట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మరో వారంలో అన్నారం పంపు హౌజ్ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. సుందిళ్ల పనులకు నవంబర్ 15 డెడ్ లైన్‌గా మంత్రి ఖరారు చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ పనులకు ఈనెలాఖరులోగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించారు. ఈనెల 10న మల్లన్నసాగర్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు.
కాళేశ్వరంపై ప్రతి నెలా సమావేశం
ప్రాజెక్టు పురోగతిపై ప్రతి నెల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇరిగేషన్ అధికార యంత్రాంగానికి వర్కింగ్ సీజన్ కావడం వల్ల మిగతా సమయాన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై హైదరాబాద్ నుంచి మానిటర్ చేయడానికి వీలుగా ప్రాజెక్టు నిర్మాణ స్థలం నుండి వీడియో కెమెరాలను తెలంగాణ నీటిపారుదల శాఖ ఇఎన్‌సి కార్యాలయం జలసౌధకు అనుసంధానం చేయనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది గతంలో వలె క్యాజువల్‌గా పని చేయరాదని యజ్ఞంలా పని చేయాలని అవసరమైతే సెలవులు, పండుగలను కూడా వదులుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ప్రభుత్వ స్పషల్ చీఫ్ సెక్రటరీ జోషి, సెక్రటరీ వికాస్ రాజ్, ప్రిన్సిపల్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఎకె జా, అటవీ శాఖ ఉన్నతాధికారి శోభ, ఇఎన్‌సి మురళీధర్‌రావు, ఎత్తి పోతల సలహాదారు పెంటారెడ్డి, ఓఎస్‌డి శ్రీ్ధర్‌రావుదేశ్‌పాండే సిఇలు ఎన్ వెంకటేశ్వర్లు, హరిరామ్, వివిధ ఎజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం.. గురువారం అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు