రాష్ట్రీయం

పేదలపై భారం పడకుండా చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 3: జిఎస్‌టి పన్ను విధానంలో పేద ప్రజలపై భారం పడకుండా చేయగలిగామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రాజేందర్ గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జేట్లి అధ్యక్షతన జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశానికి హాజరైన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాల ఆదాయం తగ్గకుండా చూడటంతో పాటు రాష్ట్రాలకు చెల్లంచవలసిన నష్ట పరిహారంపై నేటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో ఐదు శాతం వ్యాట్ విధిస్తున్న వస్తువులపై జిఎస్‌టిలో కూడా యథాతథంగా ఐదు శాతం పన్ను విధింపజేశామని ఆయన అన్నారు. కోటిన్నర లోపు టర్నోవర్‌పై పన్ను వసూలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉండాలనే అంశంపై రేపటి జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని ఈటల చెప్పారు.