రాష్ట్రీయం

అగ్నిమాపక శాఖ ఎన్‌ఒసిలకు యూజర్ చార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: బహుళ అంతస్తుల భవనాలకు అగ్నిమాపకశాఖ జారీ చేసే నో అబ్జెక్షన్ ధ్రువీకరణ పత్రాలకు (ఎన్‌ఒసి) ఇక నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల నిబంధనలు పాటించారో లేదో ఆ శాఖ తనఖీ చేసి ఎన్‌ఒసీలను జారీ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న భవనాలను అగ్నిమాపక శాఖ తనఖీ చేయడానికి 15 అడుగుల ఎత్తు కలిగిన భవనాలకు రూ. 25 వేలు, ఆ పై ఎత్తు కలిగిన భవనాలకు రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.