రాష్ట్రీయం

వేతన జీవులకు ‘ఓవర్ డ్రాఫ్ట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: ఐసిఐసిఐ వేతన వినియోగదారులకు గృహ రుణాలపై రుణ సదుపాయాన్ని వర్తింప చేయాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనికి ఐసిఐసిఐ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్‌గా నామకరణం చేశారు. టర్మ్ లోన్, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్య చికిత్స, గృహాన్ని ఆధునీకరించడం, వివాహం, విదేశీ ప్రయాణం కోసం రుణాలను తీసుకోవచ్చునని ఐసిఐసిఐ బ్యాంక్ సీనియర్ జనరల్ మేనేజర్ అనూప్ సాహ తెలిపారు. కనిష్టంగా ఐదు లక్షల నుంచి గరిష్టంగా ఒక కోటి రూపాయల వరకు రుణాలను ఇస్తారు. పది శాతాన్ని టర్మ్‌లోన్‌గా, 90 శాతం ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో పొందవచ్చు. టర్మ్‌లోన్‌కు నెలసరి వాయిదా పద్ధతి, ఓవర్ డ్రాఫ్ట్‌కు వినియోగించుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీని వసూలు చేస్తారు. గృహ రుణాలు కలిగి జీతం అందుకునే వ్యక్తులు, ఐసిఐసిఐ బ్యాంకులో వేతన ఖాతా ఉన్న వారికి మాత్రమే ఈ సదుపాయం లభిస్తుందన్నారు.