రాష్ట్రీయం

హైవేల విస్తరణకు తొలగిన అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు అవరోధాలు తొలగిపోయాయి. రహదారుల విస్తరణకు భూ సేకరణ పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ సమస్య నుంచి గట్టేక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 123కు కేంద్ర ఉపరితల రవాణాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో 604 కి.మీ నిడివిగల జాతీయ రహదారుల పనులు చేపట్టడానికి మార్గం సుగమం అయింది. నాలుగు లైన్ల జాతీయ రహదారులుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వాటిలో ఆదిలాబాద్ జాతీయ రహదారిలో 44కిమీ, కరీంనగర్ జాతీయ రహదారిలో 83కిమీ, ఖమ్మం జాతీయ రహదారిలో 75కిమీ, మహబూబ్‌నగర్ జాతీయ రహదారిలో 92కిమీ, మెదక్ జాతీయ జాతీయ రహదారిలో 64కిమీ, నల్లగొండ జాతీయ రహదారిలో 71కిమీ, నిజామాబాద్ జాతీయ రహదారిలో 56కిమీ, రంగారెడ్డి జిల్లా జాతీయ రహదారిలో 45కిమీ, వరంగల్ జాతీయ రహదారిలో 74 కిమీ రహదారులను నాలుగు లైన్ల రహదారులుగా మారనున్నాయి. వీటికిగాను సెంట్రల్ రోడ్ ఫండ్ (సిఆర్‌ఎఫ్) పథకం ద్వారా రాష్ట్రానికి రూ. 620 కోట్ల నిధులు మంజురు చేసింది.
ఇదే పద్దు కింద వచ్చే మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో 2,500కిమీ దూరం గల స్టేట్ హైవేస్‌ను నేషనల్ హైవేస్‌గా మార్చడానికి రూ. 1020 కోట్లు మంజురు చేయడానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం నుంచి అనుమతి లభించడంతో హైదరాబాద్-్భపాలపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరలో చేపట్టడానికి రోడ్లు భవనాలశాఖ సన్నహాలు చేస్తోంది. రహదారుల విస్తరణలో భూ సేకరణకు పర్యావరణం, పునరావాసం, నష్టపరిహారం, రైల్వేశాఖ అనుమతుల వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ కోసం తీసుకొచ్చిన జీవో 123 అమలు చేయడానికి అనుమతించాలని రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గఢ్కారీకి లేఖ రాశారు.
ఈ మేరకు కేంద్రం నుంచి అనుమతి లభించడంతో వచ్చే ఏడాది 2017 మార్చికల్లా రాష్ట్రంలో 604.80 కి.మీ రహదారిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రోడ్లు భవనాల శాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో 2500 కి.మీ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయడం వల్ల రాష్ట్రం దేశంలోనే ప్రధాన పారిశ్రామిక హబ్‌గా మారడానికి దోహదం చేస్తుందని అధికారులు అంచన వేస్తున్నారు.