రాష్ట్రీయం

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో 7న రుద్రాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన శంషాబాద్ ఎంఎస్ కనె్వన్షన్ సెంటర్‌లో రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్టు, ఆ కార్యక్రమంలో పండిట్ రవిశంకర్ పాల్గొంటారని ఆ సంస్థ ప్రతినిధులు వొల్లం భాస్కరరావు, పి వాణిబాల, హరీశ్, శివశంకర్ తెలిపారు. అదే విధంగా శాంతి, సామరస్యాలు లక్ష్యంగా 5వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇస్లామిక్ మదర్సా బోర్డు, హ్యూమన్ లైఫ్ ఎవేకెనింగ్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించే అంతర్జాతీయ శాంతి సదస్సుకు రవిశంకర్ హాజరవుతారని అన్నారు.
అజ్మీర్ దర్గాషరీఫ్ నుండి హజ్రత్ దివాస్ సయ్యద్ జైన్ ఉన్ అబెదీన్ అలీఖాన్ సాజ్దా నషీన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ప్రధానోపాన్యాసాలు చేస్తారని వివరించారు. ఆరో తేదీన వరంగల్‌లో జరిగే గానం, ధ్యానం, జ్ఞానం సభలో పాల్గొన్న అనంతరం ఆ సాయంత్రం కొండాపూర్‌లోని సైబర్ కనె్వన్షన్‌లో పెర్ల్ప ఆఫ్ విజ్డమ్ కార్యక్రమం జరుగుతుందని వారు చెప్పారు. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రదానం చేసిన తర్వాత రవిశంకర్ యూరప్ దేశాల్లో పర్యటించి వచ్చారని వారు చెప్పారు. భారతీయ సంప్రదాయాల ప్రకారం కార్తీక సోమవారం ఎంతో పవిత్రమైనదని, ఆనాడు చేసే రుద్రాభిషేకం, ఉపవాసం అనేక జన్మల పాపాలను హరించివేస్తోందని చెప్పబడిందని, సద్గురు చేతుల మీదుగా జరిగే అభిషేకం మరింత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంటుందని వారు చెప్పారు.
తాజాగా కొలంబియాలో శాంతి చర్చలు సఫలం చేసి ప్రభుత్వానికి, ఫార్క్ దళాలకు మధ్య శాంతి ఒప్పందాన్ని కుదర్చడం ద్వారా దాదాపు 52 సంవత్సరాల ఘర్షణకు తెరదించడంలో రవిశంకర్ చేసిన సహాయాన్ని కొలంబియా అధ్యక్షుడు కొనియాడారని వారు వివరించారు.