రాష్ట్రీయం

పెద్దశేష వాహనంపై శ్రీవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, నవంబర్ 3: కార్తీకమాసం నాగుల చవితిని పురస్కరించుకుని గురువారం తిరుమలలో పెద్దశేష వాహన ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపంలోనికి వేంచేశారు. అక్కడ వారిని బంగారు, వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్యాలతో కూడిన ఆభరణాలు, సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలతో విశేషంగా అలంకరించారు. సాధారణంగా ప్రతి గరుడ పంచమినాడు శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగగా, ప్రతియేటా తిరుమలలో నాగుల చవితినాడు కోనేటిరాయుడైన శ్రీవారు సాక్షాత్తూ తమ ప్రియ దాసానుదాసుడైన ఆదిశేషుని ప్రతిరూపమైన పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా గురువారం భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళవాయిద్యాల నడుమ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
7న పుష్పయాగ మహోత్సవం
పుష్పాలంకార ప్రియుడు, నిత్యకల్యాణ స్వరూపుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతియేటా నిర్వహించే పుష్పయాగ మహోత్సవాన్ని ఈనెల 7వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 7వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా 6వ తేదీన అంకురార్పణ సందర్భంగా వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను కూడా రద్దు చేశారు.

చిత్రం.. తిరుమలలో పెద్దశేష వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు