రాష్ట్రీయం

ఫ్లోరోసిస్‌పై సమగ్ర చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: ఫ్లోరైడ్ , ఫ్లోరోసిస్ సమస్యలపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్)లో జరుగుతుంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఫ్లోరైడ్ రీసెర్చ్, ఎన్‌ఐఎన్ ఉమ్మడిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభిస్తారు. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఫ్లోరోసిస్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అర్జున్ కండారే మాట్లాడుతూ ఫ్లోరోసిస్ వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు, వీటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చించనున్నట్టు తెలిపారు. చైనా, టర్కీ, ఇరాన్, న్యూజిలాండ్, జపాన్, అమెరికా, థాయిలాండ్ తదితర దేశాలకు చెందిన 18 మంది అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 180 మంది వైద్య నిపుణులు హాజరవుతారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఉన్న ఫ్లోరోసిస్ సమస్యపై మూడు రోజుల సదస్సులో కూలంకషంగా చర్చిస్తామన్నారు. 110 పరిశోధన పత్రాలు వచ్చాయి. డాక్టర్ ఎఎస్ నారాయణ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తాను నల్లగొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్యలపై అధ్యయనం చేశానని, ఈ అంశంపై సమగ్రంగా చర్చించనున్నట్లు చెప్పారు. నల్లగొండ జిల్లాలో నార్కెట్‌పల్లి మండలంలో మండవ యడవల్లి గ్రామాన్ని ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి విముక్తి కల్పించినట్లు చెప్పారు. ఈ గ్రామంలో భూములను సారవంతం చేశామని, ఫిల్టర్ల ద్వారా ఫ్లోరైడ్ లేకుండా చేసి మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఈ గ్రామంలో ఫ్లోరోసిస్ తీవ్రతను తగ్గించడం ఒక విజయమని, ఈ వివరాలను అంతర్జాతీయ సదస్సులో ప్రముఖంగా ప్రస్తావించనున్నట్లు చెప్పారు.
యూకే ఇన్‌చార్జ్ విక్రమ్ రెడ్డి, లండన్ ఇంచార్జ్ రత్నాకర్ కడుదుల, సభ్యులు సతీష్‌రెడ్డి బండ, సృజన్‌రెడ్డి, సత్యపాల్, సత్యంరెడ్డి కంది, మల్లారెడ్డి, రాజేశ్ వర్మ, రాకేశ్, సత్య చిలుముల, రవి ప్రదీప్, టిడియఫ్ ప్రతినిధులు, జాగృతి ప్రతినిధులు హాజరైన వారిలో ఉన్నారు.