రాష్ట్రీయం

అవినీతి సహించను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ రూరల్, అర్బన్ గృహ నిర్మాణ పథకాల్లో ఒక్క రూపాయి అవినీతి జరిగినా కఠిన శిక్ష తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను హెచ్చరించారు. గృహ నిర్మాణాన్ని ఒక పవిత్ర కార్యంగా భావించి చేపడుతున్నామని, ఇందులో అవకతవకలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖపై సోమవారం జరిగిన సమీక్షలో ఆయన ఆదేశించారు. 90 శాతం పనులు చక్కగా జరుగుతున్నా 10 శాతం పనుల్లో జరిగే అవకతవకల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. లబ్ధిదారుల ఎంపిక సత్వరం పూర్తిచేసి వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. లబ్ధిదారుల సెల్‌ఫోన్ నెంబర్లు సేకరించి నిర్మాణానికి సంబంధించిన అంశాలను తెలియచేయాలన్నారు. ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల వివరాలు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎన్టీఆర్ అప్‌గ్రెడేషన్ కింద చేపట్టే మరమ్మతులపై ప్రచారం నిర్వహించి వీలైనంత ఎక్కువమంది లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందిరా ఆవాస్ యోజన కింద చేపట్టే నిర్మాణాలను ఈ ఏడాదే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పనులను పురపాలక శాఖకు అప్పగించాలని, అవసరమైతే అర్బన్ హౌసింగ్ కార్పొరేషన్ పేరిట కొత్తగా సంస్థను ఏర్పాటు చేయాలని, దానికి మున్సిపల్ శాఖతో కలిసి బాధ్యతలు అప్పగించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తించే ప్రక్రియ సత్వరమే పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణాలకు హడ్కో నుంచి రుణం తీసుకోవాలా, వద్దా ? అనేదానిపై మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్లు 18 మాసాల్లో పూర్తిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి మృణాళిని, సిఎస్ టక్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. గృహ నిర్మాణ పథకాలపై సోమవారం జరిపిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు