రాష్ట్రీయం

రివ్వుమంటూ ఆలయ ముంగిళ్లకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 7: రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలుగా ఆలయాలను ప్రచారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం సరికొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలకు హెలికాప్టర్ సర్వీసుల్ని అందించాలని భావిస్తోంది. ఈ హెలికాప్టర్ సర్వీసులను సమ్మిట్ ఏవియేషన్ అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుంది. ఇందుకు వీలు కల్పించే అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది రెవిన్యూ, ఎండోమెంట్ విభాగం ప్రిన్సిపల్ కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ తెలిపారు. హెలికాప్టర్ సేవల్ని వినియోగించుకుని తిరుమల సహా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు వచ్చే భక్తులకు దర్శన ఏర్పాట్లనూ చేస్తామని ఆయన చెప్పారు.విజయవాడ నుంచి తిరుపతి, శ్రీశైలానికి హెలి సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, త్వరలోనే ఈ సేవల్ని ప్రారంభించేందుకు వీలుగా విజయవాడ, తిరుపతిలో యుద్ధ ప్రాతిపదికన హెలిపాడ్‌లను నిర్మించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు. శ్రీశైలం ట్రిప్‌ల కోసం కర్నూలు సమీపంలో ఉన్న సున్నిపేట హెలిపాడ్‌ను వినియోగించుకుంటామన్నారు. ఆలయాల సందర్శనకు వచ్చే భక్తులకు ఆవాసం, భోజనం, దర్శనం
సహా అన్ని సదుపాయాలను కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని, ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆలయాల సందర్శనకు వచ్చే తమకు విమాన సర్వీసుల్ని కల్పించాలంటూ ఎన్‌ఆర్‌ఐలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణ టూరిజాన్ని, అలాగే ఆలయాల టూరిజాన్ని పెంపొందించే చర్యలపై దృష్టి పెట్టామన్నారు.టూరిజాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే దాని వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వెల్లడించారు. హెలికాప్టర్లలో వచ్చే టూరిస్టులకు వసతి, దర్శన ఏర్పాట్లు చేయాలని టిటిడిని ఇప్పటికే కోరడం జరిగిందన్నారు.