రాష్ట్రీయం

మావోలతో చర్చలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 7: నక్సల్స్ ఆయుధాలు వదిలి ముందుకొస్తే చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని డిజిపి నండూరి సాంబశివరావు చెప్పారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చే మావోయిస్టులను పోలీసు శాఖ స్వాగతిస్తుందన్నారు. ‘రాష్ట్రంలో ఇకనుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలంటే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాల్సిందే. హక్కులకోసం ఉద్యమించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ పోలీసుల అనుమతి తప్పనిసరి. అయితే ఇదే సమయంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగితే అందుకు బాధ్యత వహిస్తామంటూ ఆందోళనకారులు ముందుగా ఒప్పుకోలు పత్రం సమర్పించాలి. పోరాటాల్లో ఆస్తుల విధ్వంసం జరిగితే నష్టం అంచనా వేసి అనుమతి పొందిన వ్యక్తులు లేదా సంస్థల నుంచి రికవరీ చేస్తాం. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా జారీ చేసిన ఉత్తర్వులు కచ్చితంగా అమలు చేస్తాం’ అని ఆయన ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత పోలీసు శాఖ కోల్పోయిన సంస్థల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో
శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. ప్రతీకారమనేది పోలీసులకు ఉండదని, ఆ ఆలోచన మావోలకే ఉంటుందన్నారు. ప్రజల్లో సానుభూతి లేని మావోలు పోలీసులపై ఆరోపణలు చేయడం కొత్తేమీ కాదని విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిజిపి అన్నారు.
ఇకనుంచి పిడిపిపి యాక్టు అమలు
రాష్ట్రంలో సామాన్యునికి రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజీ టు పబ్లిక్ ప్రాపర్టీ (పిడిపిపి) యాక్టు 1984 కఠినంగా అమలు చేస్తామని నండూరి తెలిపారు. ఆందోళనల సమయంలో ప్రజా ఆస్తుల విధ్వంసం జరిగితే ఆందోళన చేపట్టిన వారిపై కేసులతో పాటు నష్టపోయిన ఆస్తులను అంచనా వేసి కోర్టుకు నివేదిస్తామని, ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో బాధ్యులనుంచి రికవరీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఫ్యాక్షనిజంతోపాటు మావోయిజం, కులపరమైన గొడవలు ప్రస్తుతం పోలీసు శాఖ ఎదుర్కొంటున్న సవాళ్ళని చెప్పారు. ఒక్క అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో వందకు పైగా కులపరమైన కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆందోళనలు శాంతియుతంగా ప్రబ్లిక్ ప్రాపర్టీకి డ్యామేజ్ జరగకుండా నిర్వహించుకోవాలని సూచించారు. 253కోట్ల రూపాయలతో ఏపిలో జాతీయ స్థాయి ఫోరెన్సిక్ లేబొరేటరీ ఆఫ్ సైనె్సస్ కార్యాలయం రాజధాని ప్రాంతంలో నిర్మించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం 153 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. పోలీసు అకాడమీ, శిక్షణ కేంద్రాలు, భవనాల నిర్మాణానికి 850 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా గ్రేహౌండ్స్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామని, ప్రస్తుతం అనంతపురం పోలీసు ట్రైనింగ్ సెంటర్‌ను తాత్కాలిక పోలీసు అకాడమీగా వినియోగిస్తున్నామని నండూరి తెలిపారు. పోలీసు కంట్రోలు రూము 100 బదులు ఇక నుంచి 112 నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 9.7కోట్లు ఖర్చు చేస్తోందని, ‘నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం’ ఏర్పాటు చేస్తూ డయల్ 112ను అందుబాటులో తీసుకువస్తున్నట్లు తెలిపారు. పోలీసు రిక్రూట్‌మెంట్ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. కానిస్టేబుళ్ల ఎంపిక ప్రవేశ పరీక్షకు రాష్ట్రంలో 792 పరీక్షా కేంద్రాల్లో 3లక్షల 82వేల మంది అభ్యర్ధులు హజరయ్యారని, సివిల్, రిజర్వు, వార్డర్లు కేటగిరీలో ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు.