రాష్ట్రీయం

ఫాస్ట్ ట్రాక్‌పై దేవాదుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: దేవాదుల ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపట్ల నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులపై సోమవారం మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పనులు నత్తనడక సాగడంపై అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనికోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ఇకపై వారంవారం జిల్లా కలెక్టర్‌తో చర్చించనున్నట్టు చెప్పారు. పదహారేళ్లుగా ప్రాజెక్టు పనులు మెల్లగా సాగుతున్నాయని మంత్రి విమర్శించారు. వచ్చే ఖరీఫ్ నాటికి నర్సంపేట, ములుగు, భూపాలపల్లి, పరకాల అసెంబ్లీ నియోజక వర్గాల రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని సిఎం నిర్ణయించారని, దానికి తగ్గట్టు పనులు వేగవంతం చేయాలన్నారు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, అనుకున్న విధంగా పనులు సాగాలన్నారు. నిర్లక్ష్యం చూపిస్తే కాంట్రాక్టు సంస్థలపై 60సి నిబంధన కింద చర్యలు తీసుకుంటామని, అలసత్వం ప్రదర్శించే ఇంజనీరింగ్ అధికారులపై వేటుకు వెనుకాడేది లేదని హరీశ్‌రావు హెచ్చరించారు. దేవాదుల పనులపై తనకు ప్రతి రోజూ ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రతి శనివారం మధ్యాహ్నాం రెండు గంటలకు భూసేకరణ పనులు సమీక్షించాలని జనగామ జిల్లా కలెక్టర్ దేవసేనను ఆదేశించారు. రామప్ప, పాకాల, లక్నవరం చెరువులను నింపేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 123 జీవో ప్రకారం భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రాజెక్టు భూ సేకరణకు అటవీ శాఖాపరంగా తలెత్తే సమస్యలు ఇతర అంశాలను పరిష్కరించాలని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషిని ఆదేశించారు. 2018నాటికి దేవాదుల ప్రాజెక్టు మూడవ దశ పూర్తి చేయాలన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద నిధులిస్తున్నట్టు మంత్రి చెప్పారు. 2018 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టంగా హామీ ఇచ్చిందన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయకపోతే ప్రభుత్వం పరువు పోతుందని హరీశ్‌రావు చెప్పారు. భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి రిటైర్డ్ తహసిల్దార్లను ఔట్ సోర్సింగ్ కింద తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు మంత్రి సూచించారు. కాంతానపల్లి బ్యారేజీ పురోగతిని సమీక్షించారు. 2017 డిసెంబర్ నాటికి నీరు అందించేలా చూడాలని, రెండేళ్లలో బ్యారేజీని పూర్తి చేయాలని మంత్రి కోరారు. పంప్ హౌజ్‌లు పూర్తికాకుండా మోటార్లు, ఇతర పరికరాలు సమకూర్చుకోరాదని ఏజెన్సీలను ఆదేశించారు.

చిత్రం.. దేవాదుల ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు